విరుష్కతో హానీమూన్: కళ్ల ముందే స్వర్గం.. 200 రాత్రులే.. కళ్లు చెదిరే ఫొటోలు
Recommended Video

ఇటలీలో పెళ్లి తర్వాత విరాట్, అనుష్క దంపతులు హానీమూన్ కోసం ఫిన్‌లాండ్‌కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆర్కిటిక్ శీతాకాలం వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గతవారం ఇటలీ టస్కానీలోని బోర్గో ఫినోసియెటో వైన్ యార్డ్‌లో విరాట్, అనుష్క పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

రోమ్ టూ ఫిన్లాండ్
పెళ్లి తర్వాత విరాట్, అనుష్క రోమ్‌లో హానీమూన్ పర్యటనను ప్రారంభించారు. అక్కడి నుంచి ఫిన్లాండ్‌కు వెళ్లారు. ఫిన్లాండ్‌లో శాంతా క్లాజ్ విలేజ్‌లోని గ్లాస్ ఇగ్లూలో హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం రొవేనీమీకి సమీపంలో ఉన్నది.

మాటల్లో చెప్పలేను.. అనుష్క శర్మ
తమ హానీమూన్ పర్యటన వివరాలను ఇటీవల అనుష్కశర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. విరాట్‌తో దాంపత్య జీవితం అద్భుతంగా ప్రారంభమైంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. నిజంగా ఓ స్వర్గం కళ్ల ముందు కనిపిస్తున్నది అని అనుష్క పేర్కొన్నది.

యుద్ధంలో ధ్వంసం
రొవేనీమీ ప్రాంతం రెండో ప్రపంచ యుద్ధకాలంలో ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కిస్మస్ పండుగ సందడి కనిపిస్తున్నది. రొవేనీమీ ప్రాంతం అరోరా బొరియలిస్ (నార్తర్న్ లైట్స్) ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు. అలాంటి ప్రదేశంలో విరుష్క తమ హానీమూన్‌ను జరుపుకొంటున్నారు.

ఏడాదికి 200 రాత్రులే
రొవానిమి ప్రాంతంలో ఏడాదిలి కేవలం 200 రాత్రులు మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రదేశంలో హానీమూన్ ట్రిప్‌ను ప్రముఖ టూరిజం కంపెనీ లగ్జరీ యాక్షన్ ఏర్పాటు చేసింది. ఆర్కిటిక్, నార్డిక్ రీజియన్‌కు టూరిస్టులను పంపడం వీరి ప్రత్యేకత.

డిసెంబర్ 21న ముంబైలో రిసెప్షన్
డిసెంబర్ 21న ముంబైలో పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను బుక్ చేశారు. ఇప్పటికే క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మరికొందరికి ఇప్పడిప్పుడే పంపుతున్నారు.

వైన్ యార్డులో విరుష్క పెళ్లి
డిసెంబర్ 11న విరాట్, అనుష్క వివాహం ఇటలీలోని టస్కనీ అనే అందమైన ప్రదేశంలోని బోర్గో ఫిన్నోషియేటో అనే వైన్ యార్డులో జరిగింది. హై ప్రొఫైల్ పెళ్లికి ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











