ఇటలీలో అనుష్క, విరాట్ కోహ్లీ పెళ్లి.. యూరప్‌కు వెళ్లిన విరుష్క బంధువులు.. పూజారులు

By Rajababu

Recommended Video

Virat Kohli Anushka Sharma Marriage : Anushka Sharma Flies To Italy, Watch

బాలీవుడ్ తార అనుష్క శర్మ పెళ్లి కూతురు కాబోతున్నారనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం డిసెంబర్ 12న ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్నదనే వార్తలకు అనేక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అనుష్క, విరాట్ కోహ్లీ వివాహం ఇటాలియన్ తరహాలో జరుగుతున్నదని మీడియాలో కథనాలు ప్రముఖంగా వినిపించడంతో విరుష్క వివాహానికి అత్యంత ప్రధాన్యం ఏర్పడింది.

 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి

అనుష్క, విరాట్ కోహ్లిల వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జనవరి 4న జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. వివాహానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి అనుష్క తీసుకొన్నట్టు తెలిసింది.

డిసెంబర్ 12 మ్యారేజ్?

డిసెంబర్ 12 మ్యారేజ్?

అయితే అనుష్క, విరాట్ కోహ్లీల మ్యారేజ్ డేట్‌పై క్లారిటీ లేదు. కొందరు డిసెంబర్ 12 జరుగుతున్నట్టు వెల్లడించగా, మరికొందరు డిసెంబర్ 18న జరుగనున్నట్టు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలో వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని, తేదీలను నిశ్చయించినట్టు తెలిసింది. అప్పటి నుంచే విరాట్ ఫ్రెండ్స్, సన్నిహితులు స్విట్జర్లాండ్‌కు టికెట్లు బుక్ చేసుకొన్నట్టు సమాచారం.

 పెళ్లి ఏర్పాట్ల హడావిడి

పెళ్లి ఏర్పాట్ల హడావిడి

విరాట్, అనుష్క బంధువులు వారి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బంధువర్గాల్లో కూడా హడావిడి కనిపిస్తున్నదట. అనుష్క కుటుంబ పూజారిని కూడా ఈ విషయంలో అప్రమత్తం చేశారనేది తాజా సమాచారం. డిసెంబర్‌లో శ్రీలంకలో జరిగే వన్డే, టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ నుంచి విరాట్ తప్పుకోవడంతో పెళ్లి వార్తలు వేగం పుంజుకొన్నాయి.

 విరాట్ కోచ్ కూడా

విరాట్ కోచ్ కూడా

విరాట్ కోహ్లీ చిన్నతనంలో కోచ్‌గా వ్యవహరించిన రాజ్‌కుమార్ శర్మ ఓ కీలక మ్యాచ్‌కు గైర్హాజరు కానున్నారు. కారణం అడిగితే ఓ ముఖ్యమైన పెళ్లికి హాజరుకానున్నాని చెప్పడం విరాట్ పెళ్లి వార్తకు మరో ఆధారం లభించింది. అలాగే డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ అనుష్క ఇంటిలో కనిపించడం కూడా పెళ్లి దుస్తుల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్త వినిపించింది.

గతనెల నిశ్చితార్థం

గతనెల నిశ్చితార్థం

ఇటీవల డెహ్రాడూన్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. గతనెల కార్యక్రమానికి అమితాబ్ దంపతులు, అనిల్ అంబానీ దంపతులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైనట్టు మీడియాలో ఫొటోలు కనిపించాయి.

 యూరప్‌కు వెళ్లిన అనుష్క పూజారి

యూరప్‌కు వెళ్లిన అనుష్క పూజారి

అనుష్క వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు యూరప్‌కు బయలుదేరి వెళ్లారు. హరిద్వార్‌లోని అనంత్ ధామ్ అత్మభోద్ ఆశ్రమంలోని మహారాజ అనంత్ బాబా అనే పురోహితుడు కూడా వారి వెంట యూరప్‌కు వెళ్లడంతో అనుష్క, కోహ్లి పెళ్లి వార్త కన్ఫర్మ్ అయిపోయింది. గతంలో ఈ బాబా వద్ద అధ్యాత్మికపరమైన శిక్షణను పొందింది.

స్విట్జర్లాండ్‌కు అనుష్క, కోహ్లీ

స్విట్జర్లాండ్‌కు అనుష్క, కోహ్లీ

అనుష్క, విరాట్ కోహ్లి గురువారం రాత్రి స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లారు. అనుష్క ముంబై నుంచి బయలుదేరి వెళ్లగా, విరాట్ కోహ్లి ఢిల్లీని నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కనిపించారు. తన ఫొటోలను తీసుకొంటున్న భద్రతా సిబ్బందిని నిరాకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X