విరుష్కకు రణ్‌వీర్, దీపికా అందమైన గిఫ్ట్.. మాజీ లవర్‌కు ఏమిచ్చారో తెలుసా?
గత కొద్దికాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ తార అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల పెళ్లి చేసుకొని విహారయాత్రలో ఉన్నారు. వారి పెళ్లి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. తాజాగా ఈ నవ దంపతులకు ఓ అందమైన గిఫ్ట్ లభించింది. అది అందించిన వారు బాలీవుడ్‌లో సెన్సేషన్ ప్రేమ జంట దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ కావడం విశేషం.

బాలీవుడ్‌లో లవ్‌బర్డ్స్
సెలబ్రిటీ లవ్‌బర్డ్స్‌లో అనుష్క, విరాట్ తర్వాత అంత గొప్పగా చెప్పుకొన్న జంట పేరు రణ్‌వీర్, దీపికాల పేర్లే. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య అఫైర్ నడుస్తున్నది. అప్పుడో ఇప్పుడో వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే మాట వినిపిస్తున్నది. అయితే వీరిద్దరూ నూతన దంపతులు అనుష్క, విరాట్‌కు అందమైన, అరుదైన పూలతో కూడి ఫ్లవర్ బోకేతోపాటు, స్వయంగా రాసిన ఓ లేఖను పంపించినట్టు సమాచారం.

రణ్‌వీర్‌తో అనుష్క శర్మ
అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలినాళ్లలో రణ్‌వీర్‌తో ప్రేమ వ్యవహారం జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ప్రేమలో పడింది అనుష్క. అప్పటి నుంచి రణ్‌వీర్, అనుష్కల మధ్య అంతగా రిలేషన్స్ లేవనేది బాలీవుడ్ పత్రికల వార్తలు.

పాత ప్రేమను పక్కన పెట్టి
అయితే పాత విషయాలన్నీ మరిచిపోయేలా తన మాజీ ప్రేయసి అనుష్కకు బొకేను పంపి సయోధ్య కుదుర్చుకొన్నాడు. తాను పంపిన లేఖలో భావోద్వేగానికి గురిచేసే పదాలతో కూడిన సందేశాన్ని రణ్‌వీర్, తన తాజా ప్రేయసి దీపికతో కలిసి పంపించడం గమనార్హం.

అనుష్క, దీపికా కోల్డ్‌వార్
బాలీవుడ్‌లో అనుష్క శర్మ, దీపికా పదుకొన్ మధ్య సంబంధాలు అంతగా లేవనేది ఓ రూమర్. వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ ఉన్నట్టు బాలీవుడ్ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే విరాట్‌ను వివాహం చేసుకొన్నట్టు అధికారికంగా ప్రకటించగానే అనుష్క శర్మకు ప్రత్యేకంగా దీపికా శుభాకాంక్షలు అందజేసింది.


Click it and Unblock the Notifications











