Peda Kapu1 Twitter Review: పెద కాపు మూవీకి ఊహించని టాక్.. అసలైందే మైనస్.. ఏంటి బ్రో అంత మాట అన్నావ్?

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. సుదీర్ఘ కాలంగా ఫ్యామిలీ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్నారు. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'పెద కాపు 1' అనే సినిమాను తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీనిపై ట్విట్టర్‌లో ఎలాంటి రివ్యూలు వచ్చాయో మీరు కూడా చూసేయండి!

పెద కాపుగా వచ్చిన విరాట్ కర్ణ:'అఖండ' మూవీ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయిన చిత్రమే 'పెద కాపు 1'. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రవీందర్ రెడ్డి నిర్మించారు. మిక్కీ జే మేయర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అడ్డాలలు కీలక పాత్రల్లో నటించారు.

Virat Karrna Starrer Peda Kapu-1 Movie Twitter Review

అలాంటి కథ కావడంతో హైప్:'పెద కాపు 1' 1980వ దశకం నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంతో రూపొందింది. ఈ విషయాన్ని ప్రచార చిత్రాల్లోనే చూపించారు. రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో నడిచే ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసుకున్నారు.

టీడీపీ వాళ్లకు బిస్కెట్ వేశాడు:విరాట్ కర్ణ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన 'పెద కాపు 1' మూవీని వీక్షించిన ఒక నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'పెద కాపు సినిమాలోని మొదటి సగం అస్సలు బాగోలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు గూస్‌బమ్స్ వస్తాయని చెప్పి బిస్కెట్ వేశాడు' అంటూ రాసుకొచ్చారు.

బిలో ఏవరేజ్ మూవీ అంటూ:రూరల్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన 'పెద కాపు 1' మూవీని చూసిన మరొక నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. అందులో 'పెద కాపు మూవీ చాలా వికృతంగా ఉంది. ఒక్క సీన్ కూడా కరెక్టుగా సెట్ చేయలేదు. అస్సలు ప్రభావం కనిపించలేదు. ఈ సినిమా ఏవరేజ్ కంటే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు' అంటూ పేర్కొన్నారు.

ప్రమోషన్స్ చూసి మోసపోయా:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'పెద కాపు 1' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. అందులో 'పెద కాపు 1 సినిమా సామాన్యుడి సంతకం కాదు.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి గునపం. అతడి చెత్త సినిమాల్లోనే అత్యంత చెత్త సినిమా ఇది. ప్రమోషన్స్ చూసి మోసపోయాను. నాదే తప్పు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బయటకు వెళ్లాలనిపించింది:విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయిన 'పెద కాపు 1' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా స్పందించారు. 'పెద కాపు మూవీని చూశాను. సినిమాలోని ఒక గంట చెత్త రైటింగ్. అస్సలు క్లారిటీ లేదు. అసలు ఏం చెబుదాం అనుకుంటున్నారో.. జీరో ఎమోషన్స్. చాలా అధ్వాన్నంగా ఉంది. థియేటర్ నుంచి బయటకు వెళ్లాలని అనిపించింది' అని చెప్పుకొచ్చాడు.

అసలైందే మైనస్ అయింది:'పెద కాపు 1' సినిమాను చూసిన మరొక నెటిజన్ ట్విట్టర్‌లో 'పెద కాపు మూవీని పల్లెటూరి నాటకంగా చెప్పొచ్చు. ఇది చాలా మొరటైన సెటప్‌తో వచ్చింది. కానీ, పేలవమైన స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో వర్కౌట్ కాలేదు. సాంకేతిక విలువలు, కొందరు యాక్టింగ్ సినిమాను నిలబెట్టాయి. అయినా డ్రామాలో క్లారిటీ లేదు. కొన్ని చోట్ల విసుగు వస్తుంది' అని చెప్పారు.

మొత్తంగా మూవీకి టాక్ ఇలా:'పెద కాపు 1' మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో కనిపిస్తోన్న పోస్టులను బట్టి దీనికి ఓవరాల్‌గా మిక్స్‌డ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ఎక్కువ శాతం మంది ఇందులో డైరెక్షన్ లోపాలను ఎత్తి చూపుతున్నారు. సెటప్ అంతా బాగున్నా సినిమాను నడిపిన విధానం బాలేదని అంటున్నారు. అయితే, హానెస్ట్‌గా చేసిన ప్రయత్నానికి సినిమాను వీక్షించవచ్చని సూచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X