Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. హీరో, హీరోయిన్ కూడా ఫిక్స్!
ఈ మధ్య కాలంలో బయోపిక్స్ హవా గట్టిగానే నడుస్తోంది. రియాలిటీ కథలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో దర్శకనిర్మాతలు ఎక్కువగా నిజజీవితంలోని కథలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రియల్ లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రపంచం గుర్తించేలా ఎదిగిన ప్రముఖుల బయోపిక్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇక త్వరలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా రావచ్చు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇదే వవిషయంపై విరాట్ కూడా స్పందించాడు.
బాక్సాఫీస్ బయోపిక్స్..
బయోపిక్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగిన వాస్తవాలను తెరపై చూపించాలి అంటే అంత సులువైన విషయం కాదు. కొన్ని కాంట్రవర్సీలతో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరికొన్ని చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్నాయి. మెయిన్ గా క్రీడాకారులకు సంబంధించిన బయోపిక్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి.
ధోని నుంచి కపిల్ వరకు..
టీమిండియా జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని జీవిత ఆధారంగా బయోపిక్ వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే క్లిక్కయ్యింది. ఇక సచిన్, అజారుద్దీన్, వంటి వారి బయోపిక్స్ తో పాటు ఇండియాకు మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ బయోపిక్ కూడా తెరకెక్కింది. త్వరలోనే 83 టైటిల్ తో కపిల్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..
కోహ్లీ బయోపిక్
పరుగుల వీరుడు, ఇంటర్నేషనల్ నెంబర్ వన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కథ కూడా తెరకెక్కే అవకాశం ఉందని గతంలోనే అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక విరాట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బయోపిక్ పై కొన్ని కామెంట్స్ చేశాడు. ఒకవేళ నా బయోపిక్ గనక తెరకెక్కితే అందులో నేను హీరోగా నటించడానికి ఇష్టపడతాను అని తెలిపాడు.
Recommended Video
హీరోయిన్ అనుష్క.
నా బయోపిక్ లో నేను మాత్రమే హీరోగా ఉంటానని చెప్పిన విరాట్ కోహ్లీ ఆ కథలో హీరోయిన్ పాత్రకు అనుష్క శర్మ మాత్రమే ఉండాలని అలా అయితేనే బయోపిక్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని విరాట్ కండిషన్ పెట్టాడు. మరి కోహ్లి ఇచ్చిన పిలుపుతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏ విదంగా తెరకెక్కిస్తారో చూడాలి.