విరాట్ కోహ్లీ తరువాత ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటారో తెలుసా?
సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో పబ్లిసిటీ కోసమే కాదు ఆదాయానికి కూడా మరో మార్గమవుతోంది. సెలబ్రెటీలు ఫాలోవర్స్ ను పెంచుకుంటే చాలు ఈజీగా కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యదిక బిజినెస్ బ్రాండ్ గా ఇన్‌స్టాగ్రామ్ నిలుస్తోంది. ఇక ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా ఒక్క పోస్టుకు ఎవరు ఎంత తీసుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే అందులో విరాట్ కోహ్లీతో పాటు ప్రియాంక చోప్రా టాప్ లిస్టులో ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్
ఈ న్యూస్ తో చాలా మందికి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ మోడల్స్ తో పాటు హీరోయిన్స్ కూడా హాట్ ఫొటోలను తరచుగా పోస్ట్ చేయడం వెనుక పెద్ద బిజినెస్ నడుస్తున్నాట్లు తెలుస్తోంది. ఫాలోవర్స్ పెరిగితే ఆటో మేటిక్ గా యాడ్స్ కూడా పెరుగుతుంటాయి. దీంతో కంపెనీలు ఎగబడి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఏదైనా కంపెనీ కోసం ఒక పోస్ట్ చేసినా కూడా కోట్లల్లో ఆదాయాన్ని అందుకుంటున్నారు.

కోహ్లీ పోస్టుకు ఎంతంటే..
ఇక హాపర్‌హెచ్‌క్యూ 2021 అనే సంస్థ 'ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్' పేరుతో ఒక జాబితా విడుదల చేయగా అందులో విరాట్ కోహ్లీ వరల్డ్ వైడ్ గా టాప్ 20లో నిలిచాడు. క్రికెటర్స్ మొత్తంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్క పోస్టు చేస్తే అత్యధికంగా కోహ్లీకి 5కోట్లు అందుతాయి. ఇక అతని ఇన్‌స్టాగ్రామ్ సంపాదనే ఏడాదికి వందల కోట్లు దాటడం కాయం. కోహ్లీకి మొత్తం 132మిలీయన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

27వ స్థానంలో ప్రియాంక చోప్రా
ఇక ఇండియన్ సినీ వరల్డ్ లో చూసుకుంటే ప్రియాంక చోప్రా టాప్ లిస్టులో నిలువుగా వరల్డ్ వైడ్ గా 27వ స్థానంలో నిలిచింది. 65మిలీయన్ల ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక చోప్రా ఎకౌంట్ లో ఒక్క పోస్ట్ చేయడానికి 3కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇక ఏడాదిలో ఆమె సంపాధన కూడా ఈ దారిలోనే ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం.

నెంబర్ 2లో ది రాక్
ఇక ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా వరల్డ్ వైడ్ గా అత్యధిక ఆదాయం అందుకుంటున్న వారిలో పుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 308 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక్క పోస్ట్ చేస్తే 11.9కోట్లు వస్తాయట. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) కూడా దాదాపు అదే స్థాయిలో 11కోట్ల వరకు అందుకుంటూ రెండో స్థానంలో ఉన్నాడు. పాప్ సింగర్ అరియానా గ్రాండె 10కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











