అనుష్క పెళ్లైపోయింది.. మిస్ కాదు.. మిసెస్ విరాట్ కోహ్లీ.. (ఫొటో గ్యాలరీ)

By Rajababu

Recommended Video

'అనుష్క-విరాట్' పెళ్ళి వీడియో !

బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ఇటలీలోని మిలాన్‌లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. తమ పెళ్లి వార్తను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలిద్దరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ తార జాక్వెలైన్ ఫెర్నాండెజ్ దాదాపు విరుష్క పెళ్లి వార్తను దాదాపు ధ్రువీకరించడం గమనార్హం.

జీవితాంతం కలిసి ఉండాలని

జీవితాంతం కలిసి ఉండాలని

జీవితాంతం కలిసి ఉండాలని ఈ రోజు మేము ఒట్టుపెట్టుకొన్నాం. మా వివాహ వార్తను తెలియజేయడానికి చాలా సంతోషిస్తాన్నాం. నా కుటుంబానికి, సన్నిహితుల ప్రేమానురాగాలతో ఈ రోజు చాలా అందమైన రోజుగా మారింది. అత్యంత కీలకమైన నా జీవిత ప్రయాణంలో భాగమైన వారిందరికీ థ్యాంక్యూ అని ట్వీట్టర్‌లో విరాట్ కోహ్లీ వెల్లడించారు.

 అత్యంత మధురమైన రోజు

అత్యంత మధురమైన రోజు

విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన సందేశాన్నే అనుష్క శర్మ కూడా పోస్ట్ చేశారు. ఈ వివాహం తర్వాత విరుష్క ఇద్దరూ దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా మారిపొయారు. అనుష్క ట్విట్టర్ అకౌంట్‌లో దాదాపు 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరు సెలబ్రిటీలకు వివాహం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారికంగా ప్రకటన

అధికారికంగా ప్రకటన

తమ వివాహం వార్తను విరాట్, అనుష్క సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అధికారికంగా వెల్లడించారు. అప్పటికే విరాట్, అనుష్క మిత్రులు, సన్నిహితులు సోషల్ మీడియాలో వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 21న ముంబైలో రిసెప్షన్

డిసెంబర్ 21న ముంబైలో రిసెప్షన్

డిసెంబర్ 21న ముంబైలో పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను బుక్ చేశారు. ఇప్పటికే క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మరికొందరికి ఇప్పడిప్పుడే పంపుతున్నారు.

సవ్యసాచి ముఖర్జీ పెళ్లి బట్టల డిజైన్

సవ్యసాచి ముఖర్జీ పెళ్లి బట్టల డిజైన్

ప్రముఖ డిజైనరల్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన పెళ్లి దుస్తులను విరాట్, అనుష్క ధరించారు. పెళ్లి దుస్తుల్లో వారు అందంగా ముస్తాబయ్యారు.

యశ్ రాజ్ ఫిలింస్ ధృవీకరణ

యశ్ రాజ్ ఫిలింస్ ధృవీకరణ

అనుష్క శర్మను బాలీవుడ్‌కు పరిచయం చేసిన యశ్‌రాజ్ ఫిలింస్ విరుష్క పెళ్లివార్తను ధృవీకరించింది. అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి జరిగింది. ఇటలీలో నిరాడంబరంగా జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి బంధువులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారమే వివాహం జరిగింది.

వైన్ యార్డులో విరుష్క పెళ్లి

వైన్ యార్డులో విరుష్క పెళ్లి

విరాట్, అనుష్క వివాహం ఇటలీలోని టస్కనీ అనే అందమైన ప్రదేశంలోని బోర్గో ఫిన్నోషియేటో అనే వైన్ యార్డులో జరిగింది. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం.

గతవారమే ఇటలీకి విరుష్క

గతవారమే ఇటలీకి విరుష్క

పెళ్లి కార్యక్రమం కోసం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి గతవారం ఇటలీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. వారి వెంట కుటుంబ పూజారులు కూడా వెళ్లడంతో వారి పెళ్లి వార్తకు బలం చేకూరింది.

స్పోర్ట్స్ జర్నలిస్టు శుభాకాంక్షలు

స్పోర్ట్స్ జర్నలిస్టు శుభాకాంక్షలు

విరాట్ పెళ్లి గురించి ఓ ఔత్సాహిక క్రీడా జర్నలిస్టు ఇప్పటికే ట్విట్టర్‌లో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే విరాట్, అనుష్క పెళ్లి వచ్చేవారం జరుగనున్నదనే మరో వార్త కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

విరుష్క దాంపత్య జీవితానికి ముప్పు

విరుష్క దాంపత్య జీవితానికి ముప్పు

విరుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పలు చానెళ్లు చర్చ కథనాలను ప్రసారం చేశాయి. ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన చర్చ కార్యక్రమంలో జ్యోతిష్కుడు మాలవ్ భట్ మాట్లాడుతూ.. అనుష్క, విరాట్ మధ్య భావోద్వేగమైన విభేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆ కారణంగా వారి దాంపత్య జీవితానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని వెల్లడించారు.

అనుష్క, విరాట్ జీవితంపై

అనుష్క, విరాట్ జీవితంపై

అనుష్క, విరాట్ జీవితంపై గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి దాంపత్య జీవితంలో రానున్న రెండు సంవత్సరాలు చాలా కీలకం. కాబట్టి గ్రహాల పరిస్థితిని బట్టి వారి దాంపత్య జీవితం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి.

బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు

బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు

విరుష్క పెళ్లికి బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ హాజరుకానున్నారని కొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, విరాట్, అనుష్క పెళ్లిపై జ్యోతిష్యులు తమ వాదనలు ఇలా వినిపిస్తున్నారు.

విరుష్క లైఫ్‌లో కలతలు, విభేదాలు

విరుష్క లైఫ్‌లో కలతలు, విభేదాలు

జోతిష్యం ప్రకారం విరుష్క వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడటానికి అవకాశం ఉంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక ఒడిదుడుకులు ఏర్పడుతాయి. దాంతో వారి జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది అని పలువురు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X