భార్య అనుష్కతో కలిసి టూర్: ఇంకా పెళ్లి మూడ్లోనే విరాట్, విదేశీ వీధుల్లో చిందులు...
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్, ఆర్కిటిక్ హనీమూన్ ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఇలా గత నెల రోజులుగా హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు కొత్త దంపతులు అనుష్క శర్మ- విరాట్ కోహ్లి.
పెళ్లి తర్వాత కోహ్లి తొలిసారి తన భార్య అనుష్కతో కలిసి దక్షిణాఫ్రికా క్రికెట్ టూర్‌కు వెళ్లారు. నూతన సంవత్సర వేడుక కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ మొదలవ్వడానికి కాస్త సమయం ఉండటంతో విరుష్క జంట కేప్ టౌన్ వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు.

ఇంకా పెళ్లి మూడ్లోనే విరాట్... కేప్ టౌన్ వీధుల్లో చిందులు
కేప్‌టౌన్ వీధుల్లో విరాట్, శిఖర్ ధావన్ మరికొందరు క్రికెటర్స్ సరదాగా తిరిగారు. మధ్యలో వారికి ఓ మ్యూజిక్ బ్యాండ్ ఎదురు కావడంతో.... ఆ సంగీతానికి భాంగ్రా స్టెప్స్ వేస్తూ సందడి చేశారు.

షాపింగ్ చేస్తూ అనుష్క
అనుష్క శర్మ కేప్ టౌన్‌లో షాపింగ్ చేస్తూ బిజీగా కనిపించింది. అందరు మహిళల మాదిరిగానే అనుష్కకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం.

అనుష్క, విరాట్
కేప్‌టౌన్లో ల్యాండైన తర్వాత అనుష్క శర్మ ఇతర క్రికెటర్ల భార్యలతో కలిసి ఫోటోలు దిగుతూ బిజీగా కనిపించింది. కోహ్లి ఇలా పక్కన వెయిట్ చేస్తున్నాడు.

రెస్టారెంట్లో చిల్
కేప్ టౌన్లోని ఓ రెస్టారెంట్లో చిల్ అవుతున్న విరుష్క జంట. అక్కడ కూడా ఈ ఇద్దరూ ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.

డిస్కౌంట్ సేల్
కేప్ టౌన్లో ఓ చోట భారీగా డిస్కౌంట్ సేల్ ఉండటంతో అనుష్క అక్కడ బిజీ బిజీగా షాపింగ్ చేస్తూ కనిపించింది.
డాన్స్ వీడియో
కేప్ టౌన్ వీధుల్లో విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ డాన్స్ చేస్తున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











