పికె..గురించి అనుష్క బాయ్‌ఫ్రెండ్ విరాట్ కోహ్లి ఇలా
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొంత కాలంగా క్రికెటర్ విరాట్ కోహ్లితో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క శర్మ తన తాజా సినిమా ‘పికె' ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. తన బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లి ఇప్పటికే సినిమా చూసాడని చెప్పుకొచ్చింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమా చూసిన తర్వాత విరాట్ రియాక్షన్ ఎలా ఉంది? అంటూ రిపోర్టర్లు ప్రశ్నించగా అనుష్క సమాధానం ఇస్తూ...‘సినిమా అతనికి చాలా నచ్చింది..' అన్నారు. అయితే సినిమాపై విరాట్ అభిప్రాయం పూర్తిగా చెప్పకుండా ఆమె కో-స్టార్ అమీర్ ఖాన్, నిర్మాత విధువినోద్ చోప్రా అడ్డు పడ్డారు.

వెంటనే మైకు అందుకున్న అమీర్ ఖాన్, విధు వినోద్ మాట్లాడుతూ....విరాట్ కోహ్లికి పికె సినిమా చాలా నచ్చింది. 3 ఇడియట్స్ సినిమా కంటే బాగా నచ్చింది. అనుష్కను దక్కించుకోవడం విరాట్ కోహ్లి వరల్డ్ కప్పు దక్కినట్లుగా ఫీలవుతున్నాడు. ఇద్దరూ వారిరిలేషన్లో చాలా సంతోషంగా ఉన్నారు అన్నారు.
పికె సినిమా విషయానికొస్తే ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్, అనుష్క శర్మ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











