Virata Parvam Pre Release Event: రాసిపెట్టుకోండి బ్రో.. సినిమా ర్యాంప్.. మ్యూజిక్ డైరెక్టర్ పవర్ఫుల్ స్పీచ్

రానా దగ్గుబాటి - సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తన అద్భుతమైన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ఈ సినిమా గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

చెట్టంత మనిషి ఉన్నాడు

చెట్టంత మనిషి ఉన్నాడు

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వేడుకకు వచ్చిన ఎంతోమంది అభిమానులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది మా వెన్నెల కథ. ఈ నెల 17వ తేదీన థియేటర్లోకి రాబోతున్న మా వెన్నెల కథను మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చెట్టంత మనిషి రానా మా వెనకాలే ఉన్నారు. ఈ సినిమాకు మొత్తం కూడా ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు.. అని అన్నారు

తప్పకుండా అందరికి నచ్చుతుంది

తప్పకుండా అందరికి నచ్చుతుంది

ఈ సినిమాతో ఆడియన్స్ కు ఒక విభిన్నమైన అనుభూతిని ఇవ్వాలి అని ఆలోచించిన మా డైరెక్టర్ వేణు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాను నిర్మించిన సుధాకర్ గారికి సురేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా కెరీర్లో ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది అని నమ్మకంగా చెప్పగలను. చాలా గొప్ప టెక్నీషియన్స్ తో వర్క్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది. అందరూ జూన్ 17వ తేదీన ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నట్లు.. నవీన్ చంద్ర తెలియజేశారు.

సాయి పల్లవి మా అక్క

సాయి పల్లవి మా అక్క

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడడం నాకు ఇదే మొదటిసారి. కొంచెం గుండె దడగా ఉంది.. నిజంగా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ముఖ్యంగా వెంకటేష్ గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థాంక్స్. ఇక సాయి పల్లవి అయితే మా అక్క తో సమానం.

రాసిపెట్టుకోండి..

రాసిపెట్టుకోండి..

అలాగే రానా గారు కూడా ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాకు ఒక బలాన్ని ఇచ్చారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాకు చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సుధాకర్ చెరుకూరి గారు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు అన్న గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను.

ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్న నన్ను ఈ రోజు ఇంత వరకు తీసుకువచ్చారు. నా జీవితం మొత్తం కూడా ఆయనకు నేను రుణపడి ఉంటాను. సినిమా చూడండి బ్రో.. ర్యాంపు రాసిపెట్టుకోండి 17వ తేదీన రవన్న వస్తాడు.. ఒక ఇది ఒక పెద్ద హిట్ అని.. సురేష్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X