twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Virata Parvam Pre Release Event: నేషనల్ అవార్డ్ గ్యారెంటీ.. సినిమా సూపర్ హిట్: విక్టరీ వెంకటేష్

    |

    రానా దగ్గుబాటి - సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన విక్టరీ వెంకటేష్ విరాటపర్వం సినిమా గురించి మాట్లాడి తన అద్భుతమైన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    వెంకటేష్ పవర్ఫుల్ స్పీచ్

    వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా వచ్చిన విక్టరీ వెంకటేష్ అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విరాటపర్వం సినిమా ప్రత్యేకంగా తెరకెక్కడమే. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఈ వేడుక కోసం రావడం జరిగింది. అని వెంకటేష్ మాట్లాడారు. అంతేకాకుండా విరాటపర్వం లోని.. మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం.. అనే డైలాగ్ చెప్పి ఎంతగానో మెప్పించారు.

    ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా

    ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా

    ఇక ఈ సినిమాలో రానా ఫైర్ అద్భుతంగా ఉంది. రాణా కెరీర్ మొదటి నుంచి కూడా ఎలాంటి సినిమా చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేసినందుకు అతని ప్రత్యేకంగా గౌరవిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ను ఆడియన్స్ ప్రేమిస్తారు అని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను. ఈ సినిమా మంచి చిత్రం అవుతుందని. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.. అని అన్నారు.

    నిజాయితీగల దర్శకుడు

    నిజాయితీగల దర్శకుడు

    రానా దగ్గుబాటి ఒక రోజు తప్పకుండా విన్ అవుతాడు. వెంటనే కాకపోవచ్చు కానీ తప్పకుండా అవుతుంది. అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలుపుతున్నాను. మన తెలుగు ఇండస్ట్రీకి నిజాయితీగల దర్శకుడు వచ్చారు అని అనిపించింది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా అలానే అనుకుంటారు. ఫ్యూచర్ లో కూడా అతను ఇలాంటి మంచి సినిమాలతో రావాలి అని నేను కోరుకుంటున్నాను.. అని వెంకటేష్ అన్నారు.

    అందరూ అద్భుతంగా నటించారు

    అందరూ అద్భుతంగా నటించారు

    ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలోని కొన్ని విజువల్స్ అలాగే రైటింగ్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇక విరాటపర్వం సినిమాలో తన అద్భుతమైన నటనతో సాయిపల్లవి ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే మిగతా నటీనటులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు కొంత మంది ఆర్టిస్టులు అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తారు అని వెంకటేష్ తెలియజేశారు.

    నేషనల్ అవార్డ్ గ్యారెంటీ

    నేషనల్ అవార్డ్ గ్యారెంటీ

    సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి ఆ నవ్వు ఒక్కటి చాలు ఎంతో క్యూట్గా ఉంటుంది. ఇది తన కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సినిమాతోనే తప్పకుండా జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంటుంది అని నేను నమ్మకంగా చెప్పగలను. అలాగే ఈ సినిమాలు సాయిపల్లవి మరెన్నో చేయాలని అనుకుంటున్నట్లు వెంకటేష్ మాట్లాడారు.

    Recommended Video

    Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu Filmibeat
    సూపర్ హిట్ అదిరిపోయింది

    సూపర్ హిట్ అదిరిపోయింది

    అలాగే సినిమాటోగ్రఫీ యాక్షన్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు చాలా బాగా వర్క్ చేశారు. నిర్మాతలకు కూడా ఇలాంటి సినిమాలు మన ముందుకు తీసుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పిన వెంకటేష్ చివరలో F3 డైలాగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. సినిమా సూపర్.. అదిరిపోయిందిగా అంటూ జూన్ 17వ తేదీన రాబోయే ఈ సినిమా సూపర్ హిట్ అని వెంకటేష్ నమ్మకంగా తెలియజేశారు.

    English summary
    Virata Parvam Pre Release Event venkatesh daggubati speech..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X