twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజయ్ దేవగన్‌తో సెహ్వాగ్ అనుబంధం

    By Bojja Kumar
    |

    అనారోగ్యం, గాయాల పాలవడంవల్ల ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా ఉంటున్న క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పడు ఏం చేస్తున్నాడు? అంటే సమాధానం ముంబైలో దొరికింది. ప్రస్తుతం మ్యాచ్ లు లేక పోవడంతో ఖాళీగా ఉంటున్న ఈ చిచ్చర పిడుగు ప్రస్తుతం పలు వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ముంబైలోని పెద్ద అపార్టుమెంటులో షూటింగ్ కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అదే అపార్టుమెంటులోని మరో ప్లోర్ లో సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీరూ అజయ్ దేవగన్‌ను కలిసేందుకు స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లారు.

    వీరేంద్ర సెహ్వాగ్ రాక విషయం తెలుసుకున్న అజయ్ కూడా స్వయంగా వెళ్లి తమ సినిమా సెట్‌లోకి సెహ్వాగ్‌ను ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి కొంత సేపు క్రికెట్, సినిమాల గురించి పిచ్చాపాటిగా చర్చించుకున్నారు. అనంతరం అజయ్ దేవగన్‌పై చిత్రీకరిస్తున్న పలు కామెడీ సన్నివేశాలను వీరంద్ర సెహ్వాగ్ స్వయంగా వీక్షించారు. ఇదే షూటింగ్ లో మరో నటుడు సంజయ్ దత్ కూడా పాల్గానాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల అ రోజు హాజరు కాలేదు.

    English summary
    When Sehwag, who was shooting for a commercial at a city studio, found out that the actor was shooting a promotional video for his film on a separate floor in the same building, he decided to drop in on the sets. It was apparently a mutual fan club as both men got chatting about cricket, films and everything in between.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X