పనోరమా 2011 ఎంపికైన ఏకైక తెలుగు సినిమా

By Srikanya

తెలుగు చిత్రం విరోధి ఇండియన్ పనోరమా 2011 కి ఎంపికైంది.శ్రీకాంత్,కమిలిని ముఖర్జీ కాంబినేషన్ లో నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా విజయం సాధించలేదు.ఇక తెలుగు నుంచి ఈ ఒక్క చిత్రమే ఎంపిక కావటం శ్రీకాంత్ సోదరుడు మేకా అనిల్ నిర్మాత కావటంతో గర్వపడాల్సిన విషయం. ఇక మళాయళ చిత్రం ఊర్మి ఏడు విభాగాల్లో ఎంపికైంది.రైతులు, విధ్యార్దులు, ట్రైబల్స్ ఎందుకని నక్సలిస్ట్ లుగా మారతారు అనే నేపధ్యంలో ఈ చిత్రం తీసారు. అందులో శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. నిర్మాత అనీల్ మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ సినిమా బాగుందని మెచ్చుకొంటూంటే ఒక మంచి సినిమా తీశామనే సంతృప్తి కలిగింది. ఒక సున్నితమైన అంశంతో ఈ సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకొంది.ఈ సినిమాకు విజయాన్ని సాధించిపెట్టిన ప్రతిఒక్కరికీ తన కృతజ్ఞతలని తెలిపారు. అలాగే ఈ చిత్ర విజయంతో మరో సరికొత్త సినిమా తీయాలనే సంతోషం కలుగుతోంది అంటూ తన మనోభావాన్ని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X