Virupaksha 2: అంచనాలు పెంచేస్తోన్న విరూపాక్ష సీక్వెల్‌ పోస్టర్.. హీరో ఎవరంటే?

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మొదటి సినిమా నుంచి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. ఇటీవల కమర్షియల్ సినిమాగా బ్రో చేసినా అంతకుముందు విభిన్న పంథాలో చిత్రాలు చేస్తూ వచ్చాడు. అలా చేసిందే విరూపాక్ష (Virupaksha). తాజాగా దీనికి సీక్వెల్ పై ఓ క్లారిటీ అధికారికంగా వచ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అనంతరం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఎక్కువగా ఫ్లాప్స్ నే చవిచూశాడు. అయినా డిఫరెంట్ వేలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

Virupaksha

ఇక ఇటీవల మామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేశాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ అంతగా రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూసిన సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్ష రూపంలో సాలిడ్ హిట్ తగిలింది. ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం కాగా మొదటి మూవీతోనే మంచి హిట్ కొట్టారు. ఇందులో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ముద్దుగుమ్మ సోనియా సింగ్ ఫీమెల్ లీడ్ రోల్ చేశారు.

సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించిన విరూపాక్ష సినిమాకు సీక్వెల్ కావాలని ప్రేక్షకులు అడిగారు. దీంతో సీక్వెల్ ఉంటుందని పక్కాగా క్లారిటి ఇచ్చాడు డైరెక్టర్ కార్తీక్ దండు. ఇప్పుడు అధికారికంగా విరూపాక్ష సీక్వెల్ ప్రకటించారు. తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. "విరూపాక్ష టీమ్ మళ్లీ వచ్చేస్తుంది. మైథికల్ థ్రిల్లర్ కోసం రెడీగా ఉండండి. ప్రీ ప్రొడక్షన్ పనులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి" అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

విరూపాక్ష సీక్వెల్ పోస్టర్ లో ముగ్గురు తాడు సహాయంతో రెండు కొండల మధ్య లోయలోకి దిగుతూ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఈ సినిమాకు కూడా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా నటీనటుల గురించి ఇంకా తెలియలేదు. మరి ఇందులో సాయి ధరమ్ తేజ్ హీరోగా కొనసాగుతాడా? లేదా? ఇంకెవరినైనా ఎంపిక చేసుకుంటారా? అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X