వరాహి యాత్రకు సకలం సిద్దం.. సినీ పరిశ్రమ నుంచి భారీ చేరికలు.. పవన్ కల్యాణ్‌కు నిర్మాతల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, నీతివంతమైన రాజకీయాల కోసం నూతన అధ్యాయం లిఖించేందుకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శంఖం పూరించారు. జూన్ 14వ తేదీ నుంచి అన్నవరం సత్యదేవుడి సన్నిధి నుంచి పవన్ కల్యాణ్ యాత్రను ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు.

అయితే ప్రభుత్వ అధికారుల అడ్డంకులు, ఆంక్షల మధ్య వివాదాస్పదంగా ఈ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచే కాకుండా సంచలనమైన రీతిలో భారీగా చేరికలు ఉంటాయనే వార్త రాజకీయం ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ యాత్ర వివరాల్లోకి వెళితే..

Virupaksha Producer BVNS Prasad Joins in Pawan Kalyans Jana Sena Party

సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం చేసుకుని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కానున్నది. ప్రతి నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నాం. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగనున్నది అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Virupaksha Producer BVNS Prasad Joins in Pawan Kalyans Jana Sena Party

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పీ గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది.

Virupaksha Producer BVNS Prasad Joins in Pawan Kalyans Jana Sena Party

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. ప్రతి నియోజక వర్గంలో వారాహిపై నుంచి ప్రజలని ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు అని పార్టీ నేతలు వెల్లడించారు.

వారాహి యాత్రకు ముందు సినీ పరిశ్రమ నుంచి భారీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ కార్యాలయంలోకి నిర్మాత ప్రసాద్‌ను ఆహ్వానించి కండువా కప్పి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయనకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. బీవీఎన్ఎస్ ప్రసాద్‌తోపాటు పలువురు నిర్మాతలు కూడా వచ్చారు.

ఇక ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి పెద్దగా చేరికలు లేవు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సినీ పరిశ్రమ నుంచి భారీగా చేరికలు ఉంటాయనే విషయాన్ని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇప్పటికే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఇతర జబర్దస్ యాక్టర్లు భారీగా సంఘీభావం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గబ్బర్ సింగ్ బ్యాచ్ పవన్ పార్టీకి ఎప్పటి నుంచో భారీగా మద్దతు తెలియజేస్తున్నారు.

pawan-kalyan-tollywood-producers-351

అయితే ఇక నుంచి ప్రజలను, ఓటర్లను ప్రభావం చూపే సినీ తారలు జనసేనలోకి రానున్నట్టు సమాచారం. అయితే వీలు,అదను చూసి వారిని పార్టీలోకి సమయాన్ని బట్టి ఆహ్వానించే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా మెగా హీరోలందరూ తమ అభిమానులను పార్టీ ప్రచారంలోకి దింపేందుకు రంగం సిద్దం చేశారు. అంతేకాకుండా మెగా హీరోలు ఆర్థికంగా కూడా అండదండలు అందించేందుకు రెడీ అవుతున్నారు.

pawan-kalyan-tollywood-producers-351

ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ గావించారు. అలాగే కేంద్ర కార్యాలయానికి ఆయన భూమి పూజ కూడా చేశారు.

Virupaksha Producer BVNS Prasad Joins in Pawan Kalyans JanaSena Party

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ప్రముఖ నిర్మాత, అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. పార్టీకి అండదండలు అందించడమే కాకుండా పార్టీ అభివద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ చేరికను పురస్కరించుకొని నిర్మాతలు ఏఎం రత్నం, RRR నిర్మాత డీవీవీ దానయ్య, మైత్రీ మూవీస్ అధినేత రవి ప్రకాశ్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిబొట్ల కలిసి పవన్ కల్యాణ్‌కు సంఘీభావం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X