For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరింత ‘పవర్‌ఫుల్’... అనుష్క-విరాట్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

    By Bojja Kumar
    |
    అనుష్క-విరాట్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే !

    ఇన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి వేడుక ఇపుడు ఇండియాలో హాట్ టాపిక్. ఈ సెలబ్రిటీ కపుల్‌ను ఇపుడు అంతా 'పవర్ కపుల్' అని పిలుస్తున్నారు. ఈ ఇద్దరికీ కలిపి దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని బ్రాండ్ ఎనలిస్ట్ శైలేంద్ర సింగ్ తెలిపారు.

     వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు

    వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు

    విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం ఇండియన్ బ్రాండ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ మూమెంట్, ఇద్దరూ ఈక్వెల్ స్ట్రెంత్ మరియు అవకాశాలు కలిగి ఉన్నారు. ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుందని ఈజీగా చెప్పగలను అని శైలేంద్ర సింగ్ తెలిపారు.

     ఇద్దరి కాంబినేషన్లో మరిన్ని అవకాశాలు

    ఇద్దరి కాంబినేషన్లో మరిన్ని అవకాశాలు

    ఇపుడు ఇద్దరూ భార్య భర్తలు అయ్యారు కాబట్టి స్టెబిలిటీ, ఫ్యామిలీ, ట్రూ అండ్ లాయల్టీ అనే కొత్త కేటగిరీ క్రియేట్ చూశారు. హౌస్ లోన్స్, కార్లు, ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో వీరికి మరిన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్లు వచ్చే అవకాశం ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.

     అనుష్క శర్మ రూ. 220 కోట్లు, రోహ్లి రూ. 382 కోట్లు

    అనుష్క శర్మ రూ. 220 కోట్లు, రోహ్లి రూ. 382 కోట్లు

    ఫినాప్ రిపోర్టు ప్రకారం... విరాట్ కోహ్లి రూ. 382 కోట్లు, అనుష్క శర్మ రూ. 220 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లి మ్యాచ్ ఫీజు, ఐపీఎల్ సాలరీ మరియు ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈ భారీ మొత్తం సంపాదించారు. అనుష్క శర్మ సినిమాల రెమ్యూనరేషషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఇంత ఆస్తి కూడబెట్టిందట.

     భారీగా పెరిగిన విరుష్క ఆదాయం

    భారీగా పెరిగిన విరుష్క ఆదాయం

    ఫినాప్ రిపోర్టు ప్రకారం... గడిచిన మూడేళ్లలో అనుష్క ఆదాయం 80శాతం పెరిగింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆమె ఆస్తుల విలువ 30 శాతం, సంవత్సర ఆదాయం 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

     అనుష్క సంపాదన, పెట్టుబడులు

    అనుష్క సంపాదన, పెట్టుబడులు

    సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ముంబైతో పాటు ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్లు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువ చేసే బిఎండబ్ల్యు, రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్ కార్లు కలిగిద ఉన్నారు.

     విరాట్ కోహ్లి సంపాదన, ఆస్తులు

    విరాట్ కోహ్లి సంపాదన, ఆస్తులు

    విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ. 120 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అతడి వరల్డ్ క్లాస్ రికార్డ్స్ వల్ల ప్రపంచంలో హయ్యెస్ట్ పేయిడ్ సెలబ్రిటీగా, స్పోర్ట్స్ ప్లేయర్‌గా వెలుగొందుతున్నాడు. అతడికి రూ. 9 కోట్ల విలువ చేసే ఆరు కార్లు మెర్సిడెజ్, ఆడి, బిఎండబ్ల్యు, వాగ్స్ వ్యాగన్ ఉన్నాయి.

     140 శాతం పెరగనున్న విరాట్ ఆదాయం

    140 శాతం పెరగనున్న విరాట్ ఆదాయం

    ఫినాప్ రిపోర్ట్ అంచనాల ప్రకారం... విరాట్ ఆదాయం రాబోయే కాలంలో 140 శాతం పెరుగుతుందట. ఈ నేపథ్యంలో అతిడి ఆస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

     28 బ్రాండ్లకు ప్రచారం

    28 బ్రాండ్లకు ప్రచారం

    ఇండస్ట్రీలో ‘పవర్‌ కపుల్‌'గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్‌, అనుష్క ఇప్పటికే 28 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇద్దరూ కలిసి బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించే అవకాశాలు ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.

    English summary
    Finally, Virat Kohli and Anushka Sharma are married. The moment, pictures and video of the dazzling duo are already viral. The celebrity couple is now defined as a "power couple or a lethal combo", since both have a net worth of Rs 600 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X