twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూలై 21న జయ బి. 'వైశాఖం' : టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

    ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రాన్ని జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    |

    'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ

    ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ

    ''మా 'వైశాఖం' ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. డి.జె.వసంత్‌ ఈ సినిమాకి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆడియో సెన్సేషనల్‌ హిట్‌ అయింది. త్వరలోనే ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చెయ్యబోతున్నాం. అలాగే థియేట్రికల్‌ ట్రైలర్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

    టీజర్‌కి 3 మిలియన్‌కి పైగా వ్యూస్‌

    టీజర్‌కి 3 మిలియన్‌కి పైగా వ్యూస్‌

    అన్నింటినీ మించి ఈ చిత్రం థీమ్‌ టీజర్‌కి 3 మిలియన్‌కి పైగా వ్యూస్‌ రావడం అనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ఒక చిన్న సినిమా టీజర్‌కి ఇంత పెద్ద రెస్పాన్స్‌ వస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా వుంది. బిజినెస్‌పరంగా మా చిత్రానికి చాలా క్రేజ్‌ వచ్చింది. సీడెడ్ ఏరియాని తీసుకోవడానికి వచ్చిన శ్రీసాయిచంద్ర ఫిలింస్‌ అధినేత నరసింహ ఈ సినిమాకి వున్న బిజినెస్‌ క్రేజ్‌ని చూసి వైజాగ్‌ ఏరియా కూడా ఆయనే పంపిణీ చేస్తున్నారు.

    జూలై 21న

    జూలై 21న

    ప్రతి ఏరియా నుంచి నలుగురైదుగురు బయ్యర్స్‌ మంచి ఆఫర్స్‌తో రావడం చూస్తుంటే సినిమాకి ఎంత క్రేజ్‌ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 'వైశాఖం' ఆడియోపరంగా, థీమ్‌ టీజర్‌కి యూ ట్యూబ్‌లో వచ్చిన వ్యూస్‌ పరంగా ఇప్పుడు బిజినెస్ పరంగా మేం చాలా హ్యాపీగా వున్నాం. జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న మా 'వైశాఖం' చిత్రాన్ని మా గత చిత్రాల్లాగే సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాము'' అన్నారు.

    డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌

    డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌

    హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    దర్శకత్వం: జయ బి.

    దర్శకత్వం: జయ బి.

    ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.

    English summary
    Visakham the Movie by jaya.B will be Release on this 21 july
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X