twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయినా ఆగని అరాచకం: తుప్పరివాలన్ పైరసీతో విశాల్ కి సవాల్

    విడుదలైన కొన్ని గంటలలోనే తుప్పరివాలన్ చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తూ విశాల్‌కు షాక్‌ ఇచ్చింది. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది విశాల్ కి...

    |

    తెలుగు, తమిళం, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్... ఏ సినిమా అయినా, రిలీజ్ అయిన రోజే పైరసీ చేయడంలో దిట్టయిన 'తమిళ్ రాకర్స్' వెబ్ సైట్ నిర్వాహకులను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. గత మూడేళ్లుగా వందలాది సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్ లో పెట్టి చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించిన 'తమిళ్ రాకర్స్' అడ్మిన్ గౌరీ శంకర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు, కోలీవుడ్ ప్రముఖులూ ఆనందించేలోపే ఆ ఆనందం అంతా ఆవిరయ్యింది.

    దిమ్మ తిరిగిపోయింది విశాల్ కి

    దిమ్మ తిరిగిపోయింది విశాల్ కి

    పైరసీ పై యుద్దం అంటూ అభిమానులని కూడా రంగం లోకి దింపి ఫ్లైయింగ్ స్క్వాడ్ లాగా అన్ని థియేటర్లలోనూ నిఘాపెట్టీ హల్ చల్ చేసాడు విశాల్. అయితే అంత పక్కా చర్యలు తీసుకున్నా పైరసీని మాత్రం ఆపలేకపోయారు. విడుదలైన కొన్ని గంటలలోనే తుప్పరివాలన్ చిత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తూ విశాల్‌కు షాక్‌ ఇచ్చింది. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది విశాల్ కి...

    తుప్పరివాలన్

    తుప్పరివాలన్

    విశాల్‌ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా విశాల్‌ పలు జాగ్రత్తలు తీసుకున్నా రు. తన అభిమానులను కొన్ని బృందాలుగా విభజించి రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో నిఘాను పెట్టారు.

    పెద్ద పోరాటమే చేస్తున్నాడు

    పెద్ద పోరాటమే చేస్తున్నాడు

    ఎవరూ సెల్‌ఫోన్ లో చిత్రీకరించకుండా ఈ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. విశాల్‌ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనకు సవాల్‌ విసిరేలా తమిళ్‌ రాకర్స్ వెబ్‌సైట్‌ తుప్పరివాలన్ చిత్రాన్ని శుక్రవారం ప్రసారం చేసి షాక్‌ ఇచ్చింది. దీంతో కొత్త చిత్రాలను అనధికారంగా ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్‌లను కట్టడిచేసేందుకు విశాల్‌ పెద్ద పోరాటమే చేస్తున్నారు. అలాంటి వెబ్‌సైట్‌లపై తగిన చర్యలు చేపట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ అంతం చూస్తా

    తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ అంతం చూస్తా

    ఒక సమయంలో తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ అంతం చూస్తానని ఛాలెంజ్‌ చేశారు కూడా. కొత్త చిత్రాలు ఇంటర్నెట్‌లో అనధికారంగా ప్రచారం కాకుండా ఉండటానికి ఇంటర్నెట్‌ పరిజ్ఞాన నిపుణులతో ఆలోచనలు జరిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్‌గన్ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు గౌరీశంకర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

    ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక

    ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక

    ఇప్పుడు తమిళ్‌రాకర్స్‌ వెబ్‌సైట్‌పై, మాత్రమే కాదు అసలు మొత్తం పైరసీ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై విశాల్‌ బృందం తలపట్టుకుని కూచుందట. ఎన్ని జాగ్రత్తలూ, మరెన్ని రక్షణ చర్యలూ తీసుకుంటున్నా పైరసీని మాత్రం ఆపలేకపోతున్నారు, తమిళ్ రాకర్స్ నెట్వర్క్ చూసి పోలీసులకీ, ఇండస్ట్రీ పెద్దలకే మతి పోయిందట.. ఇక మరెన్ని వెబ్ సైట్లూ, ఇంకెందరు మనుషులూ పని చేస్తున్నారొ...

    English summary
    Despite several warning from Vishal, the actor who is also the President of Producers' Council and Secretary of Nadigar Sangam, Tamilrockers and other torrent sites have leaked the full movie of his Thupparivaalan online
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X