త్రిషను వెంటాడి..వేటాడుతున్న విశాల్
హైదరాబాద్ :విశాల్, త్రిష జంటగా తమిళంలో 'సమర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తిరు దర్శకత్వంల రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. తెలుగు వెర్షన్ కి 'వేటాడు వెంటాడు' అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలుగు నిర్మాత శ్రీనివాస్ దామెర మాట్లాడుతూ ''అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే కథ ఇది. యాక్షన్ అంశాలకు పెద్ద పీటే వేసిన చిత్రమిది. కథకి తగ్గ పేరు కుదిరింది. హీరో పాత్రధారి సంఘ విద్రోహులపై సాగించిన పోరాటం అందర్నీ ఆకట్టుకొంటుంది. బ్యాంకాక్‌లో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. త్వరలో పాటల్ని విడుదల చేస్తామప''అన్నారు.
ఫైవ్ కలర్స్ మల్టీమీడియా అధినేత శ్రీనివాస్ దామెర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 45 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందినదిగా చెప్పబడుతున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లైమాక్స్ సన్నివేశాలను బ్యాంకాక్‌లో ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించారు. పాటలను బ్యాంకాక్, మలేసియా, ఊటీ వంటి ప్రాంతాల్లో తీశారు.
కనక కణ్ణన్ రాజశేఖర్‌తో పాటు చైనాకు చెందిన ఫైట్ మాస్టర్ చింగ్ చాంగ్ ఈ చిత్రానికి ఫైట్స్ డిజైన్ చేయడం విశేషం. ఈ నెల 10న పాటలను విడుదల చేస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, సునయన తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: రిచర్డ్.


Click it and Unblock the Notifications











