హీరోయిన్ కి కాలి ఎముక విరిగింది
హైదరాబాద్: షూటింగ్‌స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో నటి విశాఖాసింగ్ కాలి ఎముక విరిగింది. 'కన్నా లడ్డుతిన్న ఆశయా'లో కనిపించిన ఆమె... ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్‌కు జంటగా 'రౌడీ ఫెలో'లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆమె వేగంగా పరిగెత్తే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది.
సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె కాలి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చిన వైద్యులు.. నెలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆమెపై తీసే సన్నివేశాలకు బ్రేక్ ఇచ్చారు. దర్శకుడు హీరో మిగతా వారిపై సీన్స్ ని ప్లాన్ చేసి పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ మీల్స్, సినిమా 5 సంయుక్త నిర్మాణంలో పాటల రచయిత కృష్ణచైతన్య తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న 'రౌడీ ఫెలో' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నారా రోహిత్ హీరోగా విశాఖ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ- అందరు సాంకేతిక నిపుణులు, క్రేజీ వ్యక్తులు ఉండడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారిందని, అరవింద్ కృష్ణ కెమేరా, సన్నీ సంగీతం చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని, త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఇతర పాత్రల్లో రావ్ రమేష్, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి, ఆహుతి ప్రసాద్, అజయ్, లాల్, ప్రవీణ్, సుప్రీత్, త్రిలోక్, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కృష్ణచైతన్య.


Click it and Unblock the Notifications











