»   » అందుకే మందుకొట్టా, అదే బార్డర్...తర్వాత చావే : విశాల్

అందుకే మందుకొట్టా, అదే బార్డర్...తర్వాత చావే : విశాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాల్ కెరీర్లో పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ సినిమా అంటే 'వాడు-వీడు'. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విశాల్ తనలోని అసలు నటుడిని చూపించాడు ప్రేక్షకులకు. ఇందులో విశాల్ మెల్లకన్నుతో నటించడం మరో విశేషం. విశాల్ ఇందులో మెల్లకన్నుతో నటించి ఉండక పోతే విశాల్ కు అంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు.

అయిమే మెల్లకన్నుతో నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తాజాగా ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నా కెరీర్లో ఎక్కువ కష్టపడ్డ సినిమా అదే...కష్టపడటంలో ఇదే బార్డర్‌. అంతకు మించి కష్టపడితే చావు తప్పదు అంటూ వ్యాఖ్యనించారు.

Vishal about his Strabismus acting in Vaadu-Veedu

ఛానల్ ఇంటర్వ్యూలో విశాల్ చెప్పిన వివరాలు...

'వాడు వీడు' చిత్రం షూటింగ్‌ 230 రోజులు జరిగింది. ఈ సినిమా ప్రారంభించాక మెల్లకన్నులో నటించాలని స్ర్కిప్ట్‌లో లేదు. ఆ షూటింగ్‌ పదహారో రోజు బాల గారు నన్ను పిలిచి 'నేను అనుకున్నట్లు నువ్వు లేవు విశాల్‌' అంటూ 'మెల్లకన్నుతో ఇలా చేయి' అనే ఆలోచన చెప్పారు. వెంటనే అది చేసి ప్రయత్నించాను. దీంతో బాలగారు ఏడ్చారు, ఏదో ఇన్వెన్షన్‌ చేసినట్లు షూటింగ్‌లో ఉండే అందరినీ పిలిచి ప్రశంసించారు. ఆ మెల్లకన్ను ఉన్నట్లు చేయటం వాంతి వచ్చింది. ఆ రోజు ఫుల్‌ హెడ్‌ ఏక్‌ వచ్చింది అని విశాల్ తెలిపారు.

'పదిరోజులు చెన్నైలోనే ఉండి లెన్సుతో ఏమైనా మెల్లకన్నుతో సాధ్యమవుతుందేమో వెళ్లు' అని పంపించారు. మా ఫ్యామిలీ డాక్టరుకు చెబితే 'నీకేమైనా పిచ్చిపట్టిందా, మెల్లకన్ను పోగొట్టుకోవడానికి వస్తారు, షూటింగ్‌ కోసం ఇలాంటివి చేయటం ప్రమాదకరం' అన్నారాయన. ఎవరైనా ఇలా చేశారా అని యూట్యూబ్‌లో వెతికాను. ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఒక్క వీడియో కూడా దొరకలేదు. దీంతో ఎలాగైనా మెల్లకన్నుతో నటించాలి. ఎవరికైనా రిఫరెన్స్‌ కావాలంటే నా వీడియో చూడాలనుకున్నాను అన్నారు.

షూటింగ్‌కు వెళ్లాను. మెల్లకన్ను పెట్టి నటిస్తుంటే తల నొప్పించేది. కళ్ళ దగ్గర ఉండే నరాలు నొప్పి పుట్టేవి. కన్నీళ్లొచ్చేవి. బాల గారితో విపరీతమైన తలనొప్పి గురించి ఏరోజూ చెప్పలేదు. అయితే తోటి నటుడు ఆర్యతో చెప్పేవాడ్ని. యాభైయ్యవ రోజు వచ్చేసరికి కెమెరా, స్టార్ట్‌ అంటూనే మెల్లకన్నులోకి వెళ్లిపోయేవాడ్ని. ఆ సమయంలోనే నొప్పిని భరించడానికి ఆల్కహాల్‌ తీసుకున్నా. ఇలా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ తలనొప్పి భరించలేక ఆల్కహాల్‌ తీసుకునేవాన్ని అని తెలిపారు.

దీంతో షూటింగ్‌ అయిపోయాక కూడా ఆల్కహాల్‌ తీసుకోవడం అలవాయింది. భయమేసింది. ఇంట్లో అమ్మ భోజనం పెడుతుంటే అనుకోకుండా షూటింగ్‌ ట్రాన్స్‌లోనే ఉన్నట్లు మెల్లకన్ను పెట్టాను. అమ్మ భయపడిపోయింది. ఈ ఆల్కహాలిక్‌ అలవాటును మానుకోలేక.. విక్రమ్‌ గారిని 'మీరు ఎలా క్యారెక్టర్స్‌లోంచి బయటికి ఎలా వస్తారు' అని అడిగాను. ' నీకోసం నువ్వు గడుపు, ఎక్కడికైనా దూరంగా వెళ్లు' అన్నారు. దీంతో నేను హిమాలయాలకు వెళ్లాను అన్నారు విశాల్.

English summary
Vishal about his Strabismus acting in Vaadu-Veedu movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu