మోహన్ బాబు చెప్పబట్టే నన్ను మానాన్న...: విశాల్

By Srikanya

హైదరాబాద్: ఎం.ధర్మరాజు ఎం.ఎ. షూటింగ్‌ జరుపుతున్నప్పుడు మోహన్‌బాబు గారు 'మీ అబ్బాయి హీరో అవుతాడు' అని మా నాన్నతో చెప్పారట. అందుకే నన్ను హీరోని చేశారు అంటూ చెప్పుకొచ్చారు హీరో విశాల్. విశాల్‌, త్రిష జంటగా నటించిన చిత్రం 'వేటాడు వెంటాడు'. తిరు దర్శకత్వం వహించారు. శ్రీనివాస్‌ దామెర నిర్మించారు. యువన్‌ శంకర్‌రాజా అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తొలి సీడీని నిర్మాతతో కలిసి రమేష్‌ ఆవిష్కరించారు. విశాల్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే... " 'పందెం కోడి'తో గుర్తింపు వచ్చింది. నటునిగా మునుపటి సినిమా 'వాడు వీడు' మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మంచి కథతో ఈ సినిమా చేశా. ఇది యాక్షన్ థ్రిల్లర్. కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నా పాత్రకు సమానంగా త్రిష పాత్ర ఉంటుంది. యువన్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. రెండు భాషల్లో ఒకేసారి డిసెంబర్ మూడో వారంలో సినిమా విడుదలవుతుంది. త్వరలో శశాంక్ వెన్నెలకంటి దర్శకత్వంలో తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతున్నా'' అని విశాల్ చెప్పారు.

ఖుష్బూ మాట్లాడుతూ ''విశాల్‌ నాకు మంచి స్నేహితుడు. త్రిషతో అతని జోడీ బాగుంది. పాటలు విన్నాను. ప్రేక్షకులు ఆదరించాలి''అని అన్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో తెలుగు, తమిళ వెర్షన్‌ల నిర్మాతలు శ్రీనివాస్, రమేశ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. బ్రోచర్‌ను సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.|

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ 'పందెం కోడి', 'వాడు వీడు' సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్టవుతుందన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాననీ, శశాంక్ సంభాషణలు బాగా రాశారనీ దర్శకుడు తిరు చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, విశాల్ కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందనీ రచయిత శశాంక్ తెలిపారు.

విశాల్, త్రిష జంటగా నటిస్తున్న 'వేటాడు వెంటాడు' సినిమా పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. తిరు దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'సమర్' చిత్రానికి ఇది తెలుగు రూపం. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై శ్రీనివాస్ దామెర ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X