ప్రేమ ప్రియమణితో కాదు...

'ప్రేమ చదరంగం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి 'పందెంకోడి' లా పోటీ పడి తెలుగు తెరపై గుర్తింపు తెచ్చుకున్న మాస్ హీరో విశాల్ . ప్రస్తుతం అతను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న 'సెల్యూట్' అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రెయిట్ చిత్రంగా రూపొందుతోంది. ఆ మధ్య విశాల్ ప్రేమలో పడ్డారనే వార్తలు తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపించాయి. అతని తొలిచిత్రం నుండి ఈ తరహా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఆ హీరోయిన్ రీమాసేన్‌తోనే విశాల్ ప్రేమలో పడ్డారంటూ ప్రారంభమైన ఈ వార్తలు అటుపై విశాల్ ఏ హీరోయిన్‌తో కలిసి నటిస్తే వారితో ప్రేమలో పడ్డారని మీడియా ఊహించే స్ధాయికి వెళ్లాయి.
ఈ వరుసలోనే విశాల్ నయనతారతో ప్రేమలో పడ్డారని కొన్నిసార్లు, ప్రియామణితో ప్రేమలో పడ్డారని కొన్నిసార్లు పత్రికలు వారు రాయడం ప్రారంభించాయి. అయితే తనపై వస్తున్న ఈ పుకార్లకు సమాధానం చెప్పాలని విశాల్ భావించి తాజాగా ఈ తరహా వివరణ ఇచ్చారు. అయితే విశాల్ మాటలు విన్నవారు మాత్రం వేరే రకంగా కామెంట్లు చేస్తున్నారు. అతను ప్రేమలో పడ్డ విషయం నిజమైతే ఆ అమ్మాయెవరో చెప్పేయచ్చు కదా అని విసుక్కొంటున్నారు. విశాల్ తన ప్రేమ విషయాన్ని ఇలా పూర్తిగా చెప్పడం లేదంటే ఆయన లవర్ కచ్చితంగా హీరోయిన్ అయ్యి ఉంటుందని వారు చెప్పుకుంటున్నారు.
ఏది ఏమైనా విశాల్ తనపై వచ్చిన పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టినట్టే పెట్టి మరో కొత్తరకమైన పుకార్లకు అవకాశం కల్పించారని మరికొందరు అనుకుంటున్నారు.తెలివైన వాడు కదా!


Click it and Unblock the Notifications











