నాడు భగత్ సింగ్‌ , నేడు కంగనా.. నీ ముందు మోకరిల్లుతాను.. విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్దం గురించి అందరికీ తెలిసిందే. అక్రమ నిర్మాణ అంటూ కంగనా ఇంటిని, కార్యాలయాన్ని కూల్చివేయడంపై రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అక్రమ కట్టడమైనా సెప్టెంబర్ 30 వరకు కూల్చకూడదని జీవో ఉన్నప్పుడు ఎలా కూలుస్తారని ఫైర్ అయింది. వీటిపై న్యాయస్థానంలోనూ ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

గత కొన్ని రోజులుగా..

గత కొన్ని రోజులుగా..

కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ మాఫియా, నెపోటిజం గ్యాంగ్‌పై దారుణమైన విమర్శలు చేసింది. ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ రాకెట్ బయటపడటంతో మరిన్ని చీకటి కోణాలను చెప్పుకొచ్చింది.

వివాదం మొదలు..

వివాదం మొదలు..

సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించడం, నిజాలు వెలుగులోకి వస్తుండటంతో ముంబై పోలీసులపై కంగనా సెటైర్లు వేసింది. తనకు వారి మీద నమ్మకం లేదని కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలతో సంజయ్ రౌత్, శివసేన నాయకులు కంగనాను బెదిరించారు. మహారాష్ట్ర, ముంబైలో అడుగుపెడితే చంపేస్తామంటూ హెచ్చరించారు. వారి బెదిరింపులకు ఏ మాత్రం భయపడని కంగనా నిన్న ముంబైలో అడుగుపెట్టింది. మరో వైపు ముంబై మున్సిపల్ అధికారులు ఆమె కార్యాలయాన్ని, ఇంటిని కూల్చేశారు.

మీ అహంకారం..

మీ అహంకారం..

ఇలా తనది అక్రమ కట్టడం అని కూల్చడంపై కంగనా నిప్పులు చెరిగింది. నేడు మీరు నా ఇంటిని కూలగొట్టారు..రేపు మీ అహంకారం కూలిపోతుంది అంటూ శివసేనును హెచ్చరించింది. ఇక కంగనాకు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా విశాల్ కూడా తన మద్దతును ప్రకటించాడు.

 కంగనాకు హ్యాట్సాఫ్..

కంగనాకు హ్యాట్సాఫ్..

నీ ధైర్యానికి, తెగింపుకు హ్యాట్సాఫ్ కంగనా. తప్పును తప్పును అని చెప్పడానికి ఒప్పును ఒప్పని చెప్పడానికి నువ్ ఎప్పుడూ ఆలోచించలేదు.. వెనకడుగు వేయలేదు. అది నీ వ్యక్తిగత విషయం కాకపోయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డావ్. ఎంతో ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నావ్ అని విశాల్ ప్రశంసించాడు.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
 నీ ముందు మోకరిల్లుతున్నాను..

నీ ముందు మోకరిల్లుతున్నాను..

నాడు 1920లో భగత్ సింగ్ చేసినట్టుగా నేడు నువ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నించడానికి ప్రజలు ఎదురుతిరిగేందుకు నిన్ను ఉదాహరణగా తీసుకుని నిలిచే ఘట్టమవుతుంది. ఇలా ప్రభుత్వాలను ఎండగట్టేందుకు సెలెబ్రిటీలే కానక్కర్లేదు కామన్ మ్యాన్‌లా కూడా పోరాడొచ్చని చాటి చెబుతున్నావ్. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ (ఆర్టికల్ 19). కుదోస్ టు యూ.. నీ ముందు మోకరిల్లుతాను.. అంటూ విశాల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X