Actor Vishal: తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో విశాల్.. ఏమన్నారంటే..

Actor Vishal: తమిళ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి పలు పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మదగజ రాజు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న విశాల్.. నీరసంగా వణుకుతూ కనిపించారు. మాట్లాడేందుకు, నడిచేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీంతో విశాల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే విశాల్ ఆరోగ్యం గురించి యూట్యూబ్ లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విశాల్ తన హెల్త్ గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై స్పందించారు.

హీరో విశాల్ తన హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలను ఖండించారు. తన ద్రుష్టికి ఆ వార్తలు వచ్చాయనీ, తననీ ఎంతమంది ప్రేమిస్తున్నారో, ఎంతమంది హృదయపూర్వకంగా ఆశీర్వదించారో అర్థమైందన్నారు. చాలామంది తాను త్వరగా కోలుకుని తిరిగి రమ్మని కోరుకున్నారని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్యం పరిస్థితి గురించి మాట్లాడుతూ.. తనకు వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందనీ, అలాంటి జర్వం అందరికీ వస్తుందనీ,తనకు ఎక్కువ స్థాయిలో ఉందని అన్నారు. తాను అనారోగ్యంతో ఉన్నందున తన తల్లిదండ్రులు మధ గజ రాజా కార్యక్రమానికి వెళ్లవద్దని సూచించారని పేర్కొన్నారు.

Vishal denied the rumors about his health condition on social media

కానీ, దర్శకుడు సుందర్ సి కోసం తాను ఆ ఈవెంట్ హాజరయ్యాననీ, ఆ సినిమా కోసం ఆయన చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫంక్షన్ ను మిస్ చేసుకోకూడదని అనుకున్నాను. కాబట్టి, తాను ఆ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. తాను క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి తాను నిజంగా రుణపడి ఉంటాననీ, వారి ప్రేమకు బానిసనీ, ఇలాంటి ప్రేమను తాను ఊహించలేదన్నారు. తాను ఈవెంట్ (మాధ గజ రాజ ప్రెస్ మీట్) నుండి బయటకు వచ్చిన తర్వాత.. చాలా మంది తనకు మెసేజ్‌లు, ఫోన్ చేసి తన ఆరోగ్యం సమాచారం తెలుసుకున్నారని, మీ ప్రేమ, అభిమానం వల్లనే తాను తొందరగా రికవరీ అయ్యానని తెలిపారు.

తాను అపోలోలో చేరినట్లు వ్యాపించిన పుకార్లను కొట్టిపారేస్తూ విశాల్ ఇలా అన్నాడు. తాను కావేరి ఆసుపత్రిలో మాత్రమే చికిత్స పొందాననీ, నన్ను వేరే ఏ ఆసుపత్రిలోనూ చేర్చలేదని తెలిపారు. 'మార్క్ ఆంటోనీ' సినిమాలో చెప్పినట్లుగా.. 'నేను పడిపోతానని నువ్వు అనుకున్నావా? నేను పడిపోను'. అదే నేను ఇప్పుడు గుర్తుచేసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. మా నాన్న, నా ఆత్మవిశ్వాసమే నా బలం. ఆ బలం ఉన్ననని రోజులు తాను ఎలాంటి అడ్డంకులనైనా.. అధిమిస్తున్నాననీ అన్నారు. తాను మూడు నెలలు లేదా ఆరు నెలలు షూటింగ్‌కి రానని చెప్పే వ్యక్తులు ఉన్నారనీ,తాను బాగానే ఉన్నాననీ, తిరిగి ట్రాక్‌లోకి వచ్చానని హీరో విశాల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: vishal madha gaja raja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X