విశాల్ గారి పెళ్లి ఎప్పుడు.. సమంతకు ఫన్నీ రిప్లై ఇచ్చిన విశాల్!
Recommended Video

విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో ఇప్పటికే విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని నిర్వహించింది. ఈ చిత్రంలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సీనియర్ హీరో అర్జున్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. తాజగా జరిగిన ఇంటర్వ్యూలో సమంత, విశాల్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది.

సైబర్ వార్
అభిమన్యుడు చిత్రం సైబర్ వార్ నేపథ్యంలో తెరెక్కింది. థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.

నా పెళ్లి గురించి ఎందుకు
తాజగా విశాల్, సమంత, అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సమంత వివాహం జరిగాక ఎక్కువ విజయాలు సొంతం అవుతున్నాయని యాంకర్ ప్రస్తావించింది. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు, నా పెళ్లి గురించి చాలా సార్లు మాట్లాడా.. ఇప్పుడు విశాల్ పెళ్లి గురించి మాట్లాడడం చాలా ముఖ్యం అని సమంత తెలిపింది.

విశాల్ గారి పెళ్లి ఎప్పుడు
విశాల్ గారి పెళ్లి ఎప్పుడు అని చర్చించుకోవాలని సమంత తెలిపింది. దీనికి విశాల్ సరదాగా సమాధానం ఇచ్చాడు. నా పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకు.. ఇపుడే 28 వచ్చింది అని ఫన్నీగా సమాధానం చెప్పగా.. కాదు 26 కదా అంటూ సమంత జోక్ చేసింది. లేదు 28 ఏళ్ళు నేను అబద్దం చెప్పను అనేసరికి అక్కడ నవ్వులు విరిశాయి. వాస్తవానికి విశాల్ వయసు 40 ఏళ్ళు.

నేరుగా తెలుగులో
నేరుగా తెలుగు చిత్రంలో నటించే విషయం గురించి విశాల్ స్పందించాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా తెలుగు చిత్రంలో నటించే సందర్భం కూడా వస్తుందని విశాల్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











