twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీతో యుద్దం మొదలయ్యింది సిద్దం కండీ... ఆ వెబ్ సైట్ పేరు పెట్టి మరీ విశాల్ వార్నింగ్

    నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. నిర్మాతల మండలిని చక్కదిద్దే పని మీద దృష్టిసారిస్తానని, పైరసీ మీద పోరాటం గట్టిగా ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా పైరసీ సినిమాలకు

    |

    తమిళ సినిమాల విషయంలో పైరసీ సైట్ల బరితెగింపు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ముందుగా ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్న తమిళనాడు రైతులకు అండగా నిలవడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు. ఆపై నిర్మాతల మండలిని చక్కదిద్దే పని మీద దృష్టిసారిస్తానని చెబుతూ.. పైరసీ మీద పోరాటం గట్టిగా ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా పైరసీ సినిమాలకు పెట్టింది పేరైన తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ పేరు పెట్టి మరీ విశాల్ వార్నింగ్ ఇచ్చాడు.

    తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు

    తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు

    ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి దర్శక, నిర్మాతలు ఎంతగానో శ్రమిస్తారు. అలా తీసిన సినిమాలను కొంతమంది పైరసి వీడియోలు చేసి నిర్మాతలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు. దీన్ని అరికట్టాలని ఎంతమంది ప్రయత్నించిన పూర్తిగా ఐతే అరికట్టలేకపోయారు.

    ఎస్-3 రిలీజవుతుంటే

    ఎస్-3 రిలీజవుతుంటే

    ఈ మధ్య సూర్య సినిమా ఎస్-3 రిలీజవుతుంటే.. రిలీజ్ రోజు ఉదయం 11 గంటల నుంచి తమ వెబ్ సైట్లో సినిమాను లైవ్ చేస్తామని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించి షాకిచ్చింది తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్. సూర్య సినిమా ఎస్‌-3ని రిలీజ్ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కే అందుబాటులోకి తెస్తామంటూ త‌మిళ్ రాక‌ర్స్ అనే పైర‌సీ వెబ్ సైట్ అధికారికంగా అనౌన్స్ చేయ‌డం ఎంత దుమారం రేపిందో తెలిసిందే.

    వారం తిరక్కుండానే

    వారం తిరక్కుండానే

    పైర‌సీ వెబ్ సైట్లు ఎంత‌గా బ‌రితెగించాయో చెప్ప‌డానికి ఇది రుజువు. ఆ వెబ్ సైట్ చేతికి త‌మ సినిమా దొర‌క్కుండా ఎస్‌-3 బృందం జాగ్ర‌త్త ప‌డింది. ఐతే వారం తిరక్కుండానే అదే వెబ్ సైట్ ఒక దారుణానికి ఒడిగ‌ట్టింది. లైట్ మ‌న్ అనే త‌మిళ సినిమాను విడుద‌ల క‌న్నా ముందే త‌మ వెబ్ సైట్లో పెట్టేసింది.

    పైరసీ భూతాన్ని పారదోలటానికి

    పైరసీ భూతాన్ని పారదోలటానికి

    ఈ సినిమా ఎలా వాళ్ల చేతికి చిక్కింద‌న్న‌ది అంతు బ‌ట్ట‌లేదు. ఇలా ఇంతగా వేళ్ళూనుకున్న పైరసీ భూతాన్ని పారదోలటానికి తాను ప్రయత్నిస్తాను అంటూ చేసిన వాగ్దానం తోనే విశాల్ ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చాడు. అసలు విశాల్ నిర్మాతల మండలి ఎన్నికల రేసులోకి వచ్చిందే పైరసీ అంశం మీద మాట్లాడి.

     బోండాలు తినడం తప్ప

    బోండాలు తినడం తప్ప

    నిర్మాతల మండలి సభ్యులు సమావేశాలు పెట్టి భజ్జీలు.. బోండాలు తినడం తప్ప పైరసీని ఆపడానికే ఏం చేసింది లేదంటూ గత ఏడాది అతను చేసిన విమర్శలు సంచలనం రేపాయి. ఆ తర్వాతే నిర్మాతల మండలితో గొడవ ముదిరి.. ఎన్నికల బరిలో నిలిచాడు విశాల్. గతంలో అతను నేరుగా పైరసీ సీడీ షాపుల మీద దాడి కూడా చేశాడు. ఇప్పుడు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పైరసీ మీద ఎలా పోరాడతాడో చూడాలి మరి.

    English summary
    Actor Vishal meets the media after winning the Producer Council Election.He said that they are going to help the TN farmers and additionally he warns the Tamilrockers and other enemies, the fight between us is started and get ready for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X