విశాల్, లక్ష్మీ మీనన్ ముద్దు సీన్ నిర్మాతలకు ఇబ్బందులు

By Bojja Kumar

హైదరాబాద్: విశాల్ హీరోగా తిరు దర్శకత్వంలో యూటీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇంద్రుడు'. హిట్ ఫ్లాపులతో సంభందం లేకుండా భాక్సాఫీస్ వద్ద వరస దండయాత్రలు చేస్తున్న విశాల్ ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 11 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా ప్రచారంలో భాగగా తాజాగా ముద్దు సీన్ ఫోటోలు విడుదల చేసారు. అయితే ముద్దుసీన్ల వల్ల ఈ చిత్రం సెన్సార్ బోర్డు వద్ద ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు. తమిళంలో 'నాన్ సిగప్పు మనిదన్'టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్నే తెలుగులో 'ఇంద్రుడు'గా రిలీజ్ చేయనున్నారు. 'గజరాజు' కథానాయికగా నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలో విశాల్ సరసన నటిస్తోంది.

Vishal - Lakshmi Menon's lip-lock puts film in trouble

నిర్మాతలు మాట్లాడుతూ "షూటింగ్ పూర్తయింది. . కులు-మనాలి, జోధ్‌పూర్, చెన్నై, థాయ్‌లాండ్‌లో షూటింగ్ చేశాం. అండర్ వాటర్ లిప్‌లాక్ సన్నివేశాలు , హైలైట్ అవుతాయి. చిత్రం షూటింగ్ రషెస్ చూసి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ థ్రిల్ ఫీలయ్యారు. బాలీవుడ్‌లో ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

రెగ్యులర్ విశాల్ స్టైల్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో అండర్ వాటర్‌లో హీరోయిన్ లక్ష్మీ మీనన్‌, విశాల్ మధ్య లిప్‌లాక్ సీన్లు చిత్రీకరించారు. విశాల్, తిరు కాంబినేషన్‌లో వస్తున్న 2 వ సినిమా ఇది. సెన్సేషనల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఫొటోగ్రఫీ: రిచర్డ్ ఎన్. నాథన్, దర్శకత్వం: తిరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X