విశాల్ వెనక మాఫియా..ఎందుకని?
హైదరాబాద్ : జీవితం చాలా మందికి వరం.. ఇంకొంత మందికి శాపం. నాకు మాత్రం యుద్ధం. నేను ఓ మామూలు కుర్రాడ్ని. కానీ అతని వెనుక పోలీసులుపడ్డారు. మాఫియా తరుముతోంది. స్నేహితులు కూడా అనుమానంగా చూస్తున్నారు. ఈ సమాజం నన్ను ద్రోహిగా జమకట్టింది. ఎందుకు? నా వెనుక ఉన్న కథేమిటి? నన్ను వెంటాడి, వేటాడుతున్నది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు విశాల్. విశాల్ హీరోగా నటిస్తున్న అనువాద చిత్రం 'వెంటాడు వేటాడు'. ఈ చిత్రంలో విశాల్..శంకర్ గా కనిపిస్తారు.
అలాగే... " 'పందెం కోడి'తో గుర్తింపు వచ్చింది. నటునిగా మునుపటి సినిమా 'వాడు వీడు' మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మంచి కథతో ఈ సినిమా చేశా. ఇది యాక్షన్ థ్రిల్లర్. కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నా పాత్రకు సమానంగా త్రిష పాత్ర ఉంటుంది. యువన్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. రెండు భాషల్లో ఒకేసారి డిసెంబర్ మూడో వారంలో సినిమా విడుదలవుతుంది. త్వరలో శశాంక్ వెన్నెలకంటి దర్శకత్వంలో తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతున్నా'' అని విశాల్ చెప్పారు.
ఈ చిత్రంలో త్రిష, సునయన హీరోయిన్స్ . శ్రీనివాస్ దామెర నిర్మాత. ఈ నెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సినిమా ఇది. విశాల్ పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. రెండు పాత్రలా? లేదంటే ఒక్కడే ఇద్దరిలా నటిస్తున్నాడా? అనే విషయాలు ఆసక్తికరం. బ్యాంకాక్‌లో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకొంటాయి. 'పందెం కోడి', 'వాడు వీడు' సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్టవుతుందన్నారు.''అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ
యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాననీ, శశాంక్ సంభాషణలు బాగా రాశారనీ దర్శకుడు తిరు చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, విశాల్ కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందనీ రచయిత శశాంక్ తెలిపారు. విశాల్, త్రిష జంటగా నటిస్తున్న 'వేటాడు వెంటాడు' సినిమా పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. తిరు దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'సమర్' చిత్రానికి ఇది తెలుగు రూపం. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై శ్రీనివాస్ దామెర ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications











