Laththi Twitter Review: లాఠీకి ఊహించని టాక్.. క్లైమాక్స్ వేరే లెవెల్.. విశాల్ హిట్ కొట్టాడా అంటే!

తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తన నటనతో సౌతిండియా మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విశాల్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు.

అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విశాల్ 'లాఠీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందో మీరే చూడండి!

లాఠీతో వచ్చేసిన హీరో విశాల్

లాఠీతో వచ్చేసిన హీరో విశాల్

కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన తాజా చిత్రమే 'లాఠీ'. ఏ వినోథ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్ బ్యానర్‌పై రమణ, నంద దురైరాజు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సునైనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఇందులో ప్రభు, తలైవసాల్ విజయ్, మునీష్‌కాంత్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచిన అప్డేట్స్

అంచనాలు పెంచిన అప్డేట్స్

యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'లాఠీ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో విశాల్ నటించిన ఈ మూవీపై భారీ బజ్ ఏర్పడింది.

అలాంటి కథ.. ఎమోషనల్‌గా

అలాంటి కథ.. ఎమోషనల్‌గా

విశాల్ హీరోగా నటించిన 'లాఠీ' మూవీ ఓ నిజాయితీ పోలీస్ కానిస్టేబుల్ కథతో రూపొందింది. లాఠీ స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. పెద్దగా పవర్ లేకున్నా ఓ విలన్ గ్యాంగ్‌‌ను ఎలా ఎదుర్కొన్నాడు? ఇందుకోసం అతడు ఏమేమీ కోల్పోయాడు? చివరకు ప్రత్యర్థులపై విజయం ఎలా సాధించాడు? అనే అంశాలతో ఈ సినిమా ఎంతో ఎమోషనల్‌గా రూపొందింది.

లాఠీ సినిమాకు అలాంటి టాక్

లాఠీ సినిమాకు అలాంటి టాక్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'లాఠీ' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాగుందని పలువురు, ఏవరేజ్ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

'లాఠీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, విశాల్ తన ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, లవ్ ట్రాకు, విలన్ గ్యాంగ్ ఎలివేషన్స్‌తో చాలా సాధారణంగా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఫుల్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉంటుదని తెలిసింది. ఇక, క్లైమాక్స్ మాత్రం ఊహించని సీన్స్‌తో నిండి ఉంటుందని సమాచారం.

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

కోలీవుడ్ స్టార్ విశాల్ ప్రధాన పాత్రలో నటించిన 'లాఠీ' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో విశాల్ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ అయినట్లు తెలిసింది. అయితే, తెలిసిన కథ కావడం, లవ్ ట్రాక్, లాజిక్ లేని సన్నివేశాలు, నిడివి ఈ మూవీకి మైనస్‌గా మారాయని టాక్.

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

తాజా సమాచారం ప్రకారం.. విశాల్ నటించిన 'లాఠీ' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ ప్యాక్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో విశాల్ వన్ మ్యాన్ షో చేశారని చెబుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. అలాగే, వేరే సినీ ప్రియులకు కూడా అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం బాగా నచ్చుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X