Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డబ్బు పెట్టి కొన్నావా? విశాల్ నీకు సూట్ కాడు.. వదిలేయ్.. అనిషాకు చేదు అనుభవం
హైదరాబాదీ అమ్మాయి అనిషా ఆళ్ల రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్టు హీరో విశాల్ ప్రకటించగానే సోషల్ మీడియా అలెర్ట్ అయింది. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. కొందరు అభినందనలు తెలుపగా, మరికొందరు తమ నోటిదురుసును చేతివాటంతో ప్రదర్శించారు. విశాల్‌తో పెళ్లి గురించి తప్పుడు కూతలు కూసిన నెటిజన్లపై అనిషా ధీటుగా సమాధానం ఇచ్చింది. నెటిజన్లు ఏమన్నారు.. వారికి అనిషా ఏం సమాధానం ఇచ్చారంటే..
విశాల్, అనిషా గురించి దారుణంగా
విశాల్, అనిషా పెళ్లి గురించి ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. నీవు డబ్బుతో ఎలాంటి బిచ్చగాడినైనా కొనుకోవచ్చు. విశాల్‌ను వదిలేసేయ్. అలాంటి హీరోను డబ్బు ఆశజూపి పెళ్లి చేసుకోవడం సిగ్గులేదా అని దారుణంగా ట్రోల్ చేశాడు. దాంతో అనిషాకు చేదు అనుభవం ఎదురైంది.
అనిషా దిమ్మతిరిగే జవాబు
తమ పెళ్లిపై వచ్చిన దారుణమైన కామెంట్‌పై అనిషా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డబ్బు కోసం నా ప్రేమలో పడ్డారని నువ్వు అనుకోవడం దారుణం. విశాల్‌పై దారుణంగా కామెంట్స్ చేయడం చూస్తే నీకు ఆయనపై గౌరవం లేదు. జీవితంపై కొన్నిసార్లైనా నమ్మకం పెంచుకో. మా బంధం చిరకాలం సాగుతుంది. నీవు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకో అని అనిషా అన్నారు.
విశాల్‌కు లేని బాధ నీకేందుకు
అనిషాపై దారుణమైన కామెంట్లు చేయడంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించలేదు. విశాల్‌కు సమస్య లేనప్పుడే నీ బాధ ఏంటి? ఒకరిని మరొకరు ఇష్టపడ్డి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. నీకు అలాంటి కామెంట్లు చేయడానికి నీకున్న అర్హత ఏంటి అని ఓ నెటిజన్ నిలదీశాడు.
విశాల్‌కు నీవు సూట్ కావు
విశాల్, అనిషా జంటపై మరో నెటిజన్ నోరు పారేసుకొన్నాడు. మీ ఇద్దరి జంట చూడటానికి దారుణంగా ఉంది. నీకు విశాల్ సూట్ కాడు. నీవంటే నాకు అసలు ఇష్టం లేదు. ఐ హేట్ యూ అంటూ నెటిజన్ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించాడు. అందుకు సమాధానంగా అనిషా థాంక్యూ అంటూ కామెంట్ చేసింది.
నా జీవితానికి సరైన జోడి
విశాల్‌తో ఎంగేజ్మెంట్ తర్వాత అనిషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టింది. నా జీవితానికి సరైన మార్గాన్ని చూపించే వ్యక్తి లభించాడు. నిజమైన ప్రేమ, అనురాగంతో విశాల్‌ను కోరుకొన్నాను. స్వచ్చమైన ఆయన హృదయంలో చోటు సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నాను అని తన పోస్టులో అనిషా పేర్కొన్నది.
భవనం పూర్తయింది.. ఇక ఆగస్టులో పెళ్లి
నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తికాకుండా నేను పెళ్లి చేసుకొనని నేను గతంలో చెప్పాను. భవన నిర్మాణం పూర్తి కావొచ్చింది. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. నా పెళ్లి బహుశా ఆగస్టులో చెన్నైలో జరుగుతుంది అని విశాల్ చెప్పాడు.