ప్లేబోయ్ గా మారి విశాల్ ముగ్గురు హీరోయిన్స్ తో...

By Srikanya

పందెంకోడి చిత్రంతో తెలుగువారికి దగ్గరైన విశాల్ త్వరలో ప్లేబోయ్ అవతారమెత్తి ముగ్గురు హీరోయిన్స్ తో ఆడుకోనున్నాడు. 'కిలాడి' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటివారంలో విడుదల చేయటానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత విక్రమ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ...' విశాల్ ఇంతవరకూ పోషించని ప్లేబోయ్ పాత్రను ఈ చిత్రంలో పోషించాడు. తను ఏ విషయంలోనైనా ఓ నిర్ణయం తీసుకునే ముందు మూడు రకాలుగా ఆలోచించడం ఈ హీరోకి అలవాటు. అలాగే తన జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఇంతకీ విశాల్ ఆడుకోబోయే ముద్దుగు ముద్దుగుమ్మలూ...తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్. ఈ ముగ్గురిలో ఎవరిని ఈ కిలాడి సొంతం చేసుకుంటాడన్న అంశాన్ని ఆసక్తికరమైన కథనంతో చిత్రీకరించాం. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ అంశాలతో సాగే ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో వీటిని చిత్రీకరించాం. అన్ని తరగతుల వారిని అలరించే చిత్రమవుతుంది' అన్నారు. జి.కె. ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విక్రమ్‌కృష్ణ నిర్మించిన ఈ 'కిలాడి' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 15కల్లా తొలి కాపీ వస్తుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X