twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా-బాలును కలుపుతున్న విశాల్... వివాదం ముగుస్తుందా?

    ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య ‘ఎందుకు పాడావ్’ వివాదం పరిష్కరించేందుకు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్‌ రంగంలోకి దిగారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య 'ఎందుకు పాడావ్' వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాను కంపోజ్ చేసిన పాటలు పాడటానికి వీల్లేదంటూ ఇటీవల ఇళయరాజా కాపీరైట్ యాక్ట్ కింద్ బాలుకు నోటీసులు పంపడం, దీనిపై బాలు ఫేస్ బుక్ వేదికగా స్పందించడం హాట్ టాపిక్ అయింది.

    ఈ వివాదం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిచింది. సినీ పాటలపై ఎవరికి ఎంత హక్కు ఉంటుంది? ఇలా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అనే అంశం గురించి అంతా చర్చించుకుంటున్నారు.

    రంగంలోకి విశాల్

    రంగంలోకి విశాల్

    కాగా...వీరిద్దరి మధ్యా ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్‌ రంగంలోకి దిగారు. వీరిద్దరినీ ఒకే వేదికపై కలపనున్నట్టు తెలిపారు.

    ఇళయరాజా సభకు బాలు కచేరి

    ఇళయరాజా సభకు బాలు కచేరి

    ప్రస్తుతం ఎస్పీబీ అమెరికాలో కచేరీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇండియా తిరిగి రాగానే, తమిళ సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు సన్మాన సభను నిర్వహించనున్నామని, దీనిలో బాలూ స్వయంగా కచేరీ చేస్తారని తెలిపారు. వీరిద్దరితో ఇప్పటికే ఈ విషయమై మాట్లాడామని అన్నారు.

    అసలు వివాదానికి కారణం ఏమిటి?

    అసలు వివాదానికి కారణం ఏమిటి?

    బాలు, ఇళయరాజా మధ్య వివాదానికి సంగీత కచేరికి ఎస్పీబీ డిమాండ్ చేసిన పారితోషికమే. గతేడాది అమెరికాలో ఇళయరాజా అమెరికాలో భారీగా కచేరిలు నిర్వహించారు. అపుడు బాలు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, నిర్వాహకులు అంత ఇవ్వలేమని నిర్వాహకులు చెప్పడంతో ఇళయరాజా కొత్త గాయకులతో పాడించాల్సి వచ్చింది.

    అందుకే ఇపుడు నోటీసులు

    అందుకే ఇపుడు నోటీసులు

    అపుడు తాను నిర్వహించిన కచేరీలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని పాడని బాలసుబ్రహ్మణ్యం.... ఇపుడు అమెరికాలో సొంతగా కచేరీలు నిర్వహిస్తుండటంతో ఇళయరాజాకు కోపం వచ్చి కాపీ రైట్ యాక్ట్ ప్రకారం నోటీసులు పంపారు.

    కాపీ రైట్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత?

    కాపీ రైట్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత?

    మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, నిర్మాత, గాయకుల్లో గీత రచయిత, సంగీత దర్శకుడికి ఎక్కువ మొత్తం చెల్లించాలనే నిబంధన కాపీరైట్ చట్టంలో ఉన్నట్టు సమాచారం. దానిని ఆధారంగా చేసుకొనే బాల సుబ్రమణ్యంకు ఇళయరాజా నోటీసులు పంపినట్టు సమాచారం.

    నోటీసులపై ఘాటుగా స్పందించిన బాలు

    నోటీసులపై ఘాటుగా స్పందించిన బాలు

    ఎస్పీబీ50 పేరుతో తన కొడుకు ప్లాన్ చేసిన వల్డ్ టూర్ లో భాగంగా టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇండియాలోని పలు చోట్ల కూడా ప్రదర్శనలిచ్చినట్లు, అపుడు తాను ఇళయరాజా పాటలు పాడినా ఎలాంటి అభ్యంతరాలు తెలుపలేదన్నారు ఎస్పీ బాలు. గతంలో ఎలాంటి అభ్యంతరాలు తెలుపని ఇళయరాజా...ఇపుడు అమెరికా టూర్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇళయరాజా ఎందుకిలా స్పందించారో తెలియడం లేదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫేస్ బుక్ లో పోస్టు పోట్టి ఈ విషయాన్ని పబ్లిక్ చేసారు.

    ఇకపై ఇళయరాజా పాటలు పాడను

    ఇకపై ఇళయరాజా పాటలు పాడను

    ఆయన పాటలు పాడితే చట్టపరమైన అడ్డంకులు ఉంటాయని తెలియదని, అందుకే తన ట్రూప్ ఇక ఇళయరాజా పాటలు పాడబోదని ఎస్పీబీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలియక చేసామని, ఇకపై అలా చేయబోమన్నారు. అదృష్ట వశాత్తు... ఆ భగవంతుడి కృప వల్ల ఇతర సంగీత దర్శకుల పాటలు ఎన్నో పాడానని, వాటినే ఈ ఈవెంట్‌లో పాడుతాను అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇళయారాజ పాటలు ఎందుకు పాడటం లేదనే ప్రశ్నలు రాకూడదనే ఈ పోస్టు పెట్టాను, నేను వెల్లడించిన ఈ విషయంపై ఎదుటివారిని నొప్పించే విధంగా ఎలాంటి కామెంట్లు పెట్టవద్దని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

    English summary
    Vishal Plans a Orchestra with SPB and Ilayaraja. Amidst all the controversy surrounding SPB and Ilayaraja regarding the legal notice.Actor Vishal in a recent press meet revealed that a Grand Ilayaraja Music concert will be held to raise 100 crore fund for Tamil Film Producers Council. Vishal went on add that Prakash raj has already met Ilayaraja who has also
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X