రూ 30 వేలు పోగుట్టుకున్నా, అభిమన్యుడు చిత్రంలో.. హీరోయిన్‌తో ఎఫైర్ గురించి క్లారిటీ, పవన్ గురించి!

Recommended Video

Vishal Comments On Pawan Kalyan | Filmibeat Telugu

చాలా కాలం తరువాత అభిమన్యుడు చిత్రంతో మంచి విజయం అందుకున్న విశాల్ జోష్ మీద ఉన్నాడు. సైబర్ వేదికగా జరుగుతున్న అక్రమాలని అభిమన్యుడు చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయంగా నిలిచింది. విశాల్, సమంత ఈ చిత్రంలో జంటగా నటించారు. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

చాలా విషయాలు తెలుసుకున్నా

చాలా విషయాలు తెలుసుకున్నా

అభిమన్యుడు చిత్ర కథ వింటున్న సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నానని విశాల్ విశాల్ తెలిపాడు. ఆర్మీ వాళ్లకు సరిగా రేషన్ ఉండదు, రైతులకు లోన్స్ ఇవ్వరనే విషయం అందరికి తెలుసు. ఆధార్ నంబర్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి వంటి విషయాలు తెలుసుకున్నానని విశాల్ తెలిపాడు.

అభిమన్యుడు చిత్రంలో

అభిమన్యుడు చిత్రంలో

అభిమన్యుడు చిత్రం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కానీ జరుగుతున్న లోపాలని మాత్రం ఎత్తి చూపామని విశాల్ తెలిపాడు. ఆధార్ కార్డు విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో మోడీ గారికే తెలుసు అని అన్నారు.

30 వేలు పోయాయి

30 వేలు పోయాయి

తాను ఓ సారి బ్యాంకులో 30 వేలు పోగొట్టుకున్నానని విశాల్ తెలిపాడు. బ్యాంకు వారిని అడిగితే మీరే ఆన్ లైన్ లో వాడుకున్నారని సమాధానం ఇచ్చారని విశాల్ తెలిపాడు.

రైతులకు సాయం

రైతులకు సాయం

రెండు తెలుగు రాష్ట్రలో అభిమన్యుడు చిత్రం మంచి లాభాలతో రన్ అవుతోందని విశాల్ తెలిపాడు. ఆ లాభం నుంచి కొంత రైతులకు సాయం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు.

వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారో

వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారో

రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అని విశాల్ తెలిపాడు. తాను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. రజని, కమల్ హాసన్ ఏం చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నా. వారి మేనిఫెస్టో నచ్చితే వారివెంట నడిచే అవకాశం ఉందని విశాల్ తెలిపాడు.

పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ మంచి చేయాలని ప్రజల్లోకి వచ్చారు. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు విశాల్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించాలని రాజకీయాల్లోకి రాలేదని అన్నాడు.

హీరోయిన్‌తో ఎఫైర్ గురించి

హీరోయిన్‌తో ఎఫైర్ గురించి


చాలా రోజులుగా సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, విశాల్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విశాల్ స్పందించాడు. తనకు వరలక్ష్మి మంచి స్నేహితురాలని విశాల్ తెలిపాడు. తన కష్టాలు సంతోషాలు వరలక్ష్మితో పంచుకుంటానని, మా మధ్య ఎదో జరుగుతోంది అనే వార్తల్లో వాస్తవం లేదని విశాల్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X