twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ అభిమన్యుడు ఫస్ట్‌లుక్ అదుర్స్.. సంక్రాంతి పద్మవ్యూహంలో విశాల్‌, సమంత

    పందెం కోడి నుంచి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌. ప్రస్తుతం డిటెక్టివ్‌ పెద్ద హిట్‌ అయిన ఆనందంలో విశాల్ వున్నారు.

    By Rajababu
    |

    Recommended Video

    'అభిమన్యుడు' ఫస్ట్‌లుక్ అదుర్స్

    పందెం కోడి నుంచి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌. ప్రస్తుతం డిటెక్టివ్‌ పెద్ద హిట్‌ అయిన ఆనందంలో విశాల్ వున్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌ హీరో విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్‌ని ఖరారు చేశారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌ 18న విడుదల చేశారు. రిలీజ్ చేసిన వెంటనే ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     హై రేంజ్ సినిమా ఇది

    హై రేంజ్ సినిమా ఇది

    ఈ చిత్రం గురించి మాస్‌ హీరో విశాల్‌ తెలియజేస్తూ ''ఇంతకుముందు నేను చేసిన అన్ని సినిమాలకంటే హై రేంజ్‌ సినిమా ఇది. హీరోగా, నిర్మాతగా నాకు బాగా నచ్చిన సినిమా. డెఫినెట్‌గా ఈ సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. దర్శకుడు మిత్రన్‌ సబ్జెక్ట్‌ని చాలా బాగా డీల్‌ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది'' అన్నారు.

     నవంబర్‌ 18న ఫస్ట్‌లుక్ రిలీజ్

    నవంబర్‌ 18న ఫస్ట్‌లుక్ రిలీజ్

    నిర్మాత జి.హరి మాట్లాడుతూ ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నవంబర్‌ 18 ఉదయం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సాయంత్రం మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తాం. డిసెంబర్‌ 27న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశార. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం.

     డిఫరెంట్‌ రోల్‌లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌

    డిఫరెంట్‌ రోల్‌లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌

    విశాల్‌ కెరీర్‌లోనే హై బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతున్న సినిమా చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్దగా తెరపై కనిపించని అర్జున్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

     విశాల్ సరసన సమంత

    విశాల్ సరసన సమంత

    మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

    English summary
    After huge success, Hero Vishal's new movie is Abhimanyudu. Samantha Akkineni is the heroine. This movies first look set release on November 18th. In this occassion, Producer G Hari speaks to media and revealed that This movie is set to release on January 13. Action King Arjun playing a crucial role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X