విశాల్, సమంత కోసం నితిన్ ఏమి చేశాడో తెలుసా?

By Rajababu

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ విడుదల చేసిన మొదటి పాట ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌స్టార్‌ నితిన్‌ ఇటీవల విడుదల చేశారు.

'తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా..' అంటూ సాగే ఈ పాటను శ్రేష్ట రచించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారధ్యంలో జితిన్‌రాజ్‌ ఆలపించారు.

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''హీరో నితిన్‌గారు ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. యువన్‌ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X