»   » హీరోయిన్‌‌ను కండోమ్ తీసుకోమన్నాడు: వివాదంలో విశాల్!

హీరోయిన్‌‌ను కండోమ్ తీసుకోమన్నాడు: వివాదంలో విశాల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశాల్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కథకళి' తమిళంతో పాటు తెలుగులోనూ సంక్రాంతికి విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం వివాదంలో పడింది. సినిమాలోని ఓ సీన్లో విశాల్... హీరోయిన్ తో కండోమ్ తీసుకో అంటూ డైలాగ్ కొట్టడం వివాదంగా మారింది.

ఆ డైలాగ్ మహిళలను కించ పరిచే విధంగా ఉందంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల్లో తన భర్త శరత్ కుమార్‌ను విశాల్ ఓడించడంతో... నటి రాధిక కూడా ఇదే అదునుగా ఆందోళన కారులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. కండోమ్ అనేది సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అంశం, అందులో కించపరడం, అశ్లీలం ఏమీ లేదు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుందని విశాల్ అంటున్నారు.

Vishal's condom comment in Kathakali creates controversy

సినిమా వివరాల్లోకి వెళితే...విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ నిర్మిస్తున్న మాస్ ఎంటర్టెనర్ ‘కథకళి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజవుతోంది. సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ... నా కెరీర్లో మరో డిపరెంట్ కమర్షియల్ మూవీ ‘కథాకళి'. డైరెక్టర్ పాండిరాజ్ ఈ కథను చాలా అద్భుతంగా డీల్ చేసారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెనర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో నాకు మళ్లీ మరో హిట్ అవుతుంది' అన్నారు.

విశాల్ సరసన కేథరిన్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కరుణాస్, శత్రు, సూరి, శ్రీజిత్ రవి, పవన్, మైమ్ గోపీ, మధుసూదన్ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్: ప్రదీప్, మాటలు: శశాంక్ వెన్నెల కంటి, ఫైట్స్: అనల్ అరసు, పాటులు: వెన్నెలకంటి, భువనచంద్ర, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్.

English summary
Vishal answers to Radhika Sarathkumar's tweet and finds nothing wrong with that scene. Check out the video to know more!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu