అసలే యాక్షన్ హీరో... ఆపై కత్తి పట్టాడు(పోస్టర్)
హైదరాబాద్ : యాక్షన్ హీరోలు...కత్తి పట్టుకుని పోస్టర్ పై కనపడితే ఆ కిక్కే వేరు అంటారు మాస్ జనాలు. ఓపినింగ్ రోజున థియోటర్స్ హౌస్ ఫుల్ అవటానికి ఈ ఒక్క పోస్టర్ చాలు అంటారు. సూర్యతో సింగం వంటి సూపర్ హిట్ ఇచ్చిన హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందుతున్న 'పూజ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ యాక్షన్ కి అల్టిమేట్ గా ఉందని ప్రశంసలు వినపడుతూండటంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు.
విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం రోజుకో సంచలన వార్తతో ముందుకొస్తోంది. ఇందులో బీహార్ సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బీహారి తళుక్కుమని మెరవబోతుండటం తాజా కబురు. ఈ సినిమా క్లెమాక్సులో వినయ్ బీహారి ఒక జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఇది ముందుగా అనుకుని చేసింది కాదని, ఆయన నటించడం యాధృచ్ఛికంగా జరిగిందేనని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమా కథ ప్రకారం కొంతభాగం బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందుకోసం ఆ రాష్ట్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఆ లోకేషన్స్‌ను హీరో విశాల్, దర్శకుడు హరి వెతుకుతున్న సమయంలో బీహారిని కలిశారు. ఈ సినిమా గురించి విన్న ఆయన తనకూ నటించాలని ఉందనే కోరికను వ్యక్తం చేయడంతో దర్శకుడు ఓకే అన్నారట.
వినయ్ బీహారి భోజ్‌పురీ సినిమాల్లో మంచి పేరున్న వ్యక్తి. అక్కడ 300 సినిమాల్లో దాదాపు వెయ్యి పాటలు రాశారట. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవమూ ఉంది. ఈ బీహార్ మంత్రి వివాదాస్పదుడు కూడా. సెల్‌ఫోన్లు, మాంసాహారం తీసుకోవడం వల్లే దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో పెనుదుమారం రేపాయి.


Click it and Unblock the Notifications











