రషెస్ చూసి రణబీర్ కపూర్ హిందిలో చేస్తానన్నాడు
హైదరాబాద్ : విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మీమీనన్ హీరోయిన్. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దార్థ్‌రాయ్ కపూర్, విశాల్ నిర్మాతలు. ఈ చిత్రానికి తెలుగులో 'ఇంద్రుడు' పేరుని ఖరారు చేశారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.

విశాల్ మాట్లాడుతూ ''తిరుతో మరోసారి జత కట్టడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ అంశాలు మేళవించిన ఓ ప్రేమ కథ ఇది. వినోదానికి ప్రాధాన్యం ఉంది. సాంకేతికంగానూ ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది. కులుమనాలి, జోథ్‌పూర్, థాయ్‌లాండ్, చెన్నైలలో కీలక భాగం తెరకెక్కించాం. మిగిలిన రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. నా కెరీర్‌లో ఇది మర్చిపోలేని చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.
ఇప్పటివరకూ జరిగిన చిత్రం షూటింగ్ రషెస్ చూసి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ థ్రిల్ ఫీలయ్యారనీ, బాలీవుడ్‌లో ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనీ నిర్మాతలు చెప్పారు. 'గజరాజు' హీరోయిన్ గా నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలో విశాల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఫొటోగ్రఫీ: రిచర్డ్ ఎన్. నాథన్, దర్శకత్వం: తిరు.


Click it and Unblock the Notifications











