Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విశాల్‌కు షాక్.. వలలో పడిన పందెంకోడి.. ఫుల్ సినిమా లీక్..
పైరసీ రక్కసిపై పోరాటం చేస్తున్న నటుడు, నిర్మాత విశాల్‌కు పెద్ద షాక్ తగిలింది. పైరసీదారులకు, విశాల్‌కు జరుగుతున్న పోరాటం రెండడుగులు ముందుకు, మరో అడుగు వెనుకకు అనే చందంగా మారింది. భారీ అంచనాలతో రిలీజైన పందెం కోడి 2 పూర్తి చిత్రం ఆన్లైన్లో లీకైంది. ఈ సినిమాకు విశాల్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..
పాజిటివ్ రెస్పాన్స్‌తో
13 ఏళ్ల తర్వాత పందెం కోడి సినిమాకు సీక్వెల్‌గా పందెం కోడి 2 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్, సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సానుకూలమైన రెస్పాన్స్ వస్తున్న తరుణంలో పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది.
పైరసీదారులతో ఫైట్
పందెం కోడి సినిమా రిలీజ్‌కు ముందు విశాల్ పైరసీని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకొన్నాడు. తమిళనాడులోని తిరుచూరు, తంజావూర్ జిల్లాలో సినిమా రిలీజ్ చేయకుండా నిర్ణయం తీసుకొన్నారు. ఆ జిల్లాలోని 40 థియేటర్లలో పైరసీకి అవకాశం ఉండటంతో విశాల్ తన సినిమాను విడుదల చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు.
పూర్తి సినిమా టొరెంటోలో
పందెం కోడి 2 పూర్తి సినిమాను టొరెంట్ సైట్లో పెట్టారు. సినిమా పూర్తి నిడివి 2.3 జీబీగా ఉండటం గమనార్హం. డౌన్‌లోడ్‌కు కూడా పైరసీదారులు అవకాశం కల్పించడం తమిళ చిత్ర పరిశ్రమకు సవాల్ విసిరనట్టయింది.
వెబ్సైట్లపై ఉక్కుపాదం
గతంలో పైరసీదారులు, ముఖ్యంగా తమిళ్ రాకర్ వెబ్‌సైట్‌పై విశాల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. పైరసీ గ్యాంగ్‌కు, విశాల్‌కు మధ్య గట్టి యుద్ధమే జరిగుతున్నది. పలు దేశాల్లో పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లను మూయించారు. అయినా ఏదో విధంగా పైరసీదారులు సినిమాను లీక్ చేస్తున్నారు.
కలెక్షన్లకు గండి
ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుస విజయాలను నమోదు చేసుకోవడంతో పందెం కోడి2 సినిమాపై క్రేజ్ ఏర్పడింది. భారీ రేటుకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మడం జరిగింది. తాజా లీక్‌తో వసూళ్లకు గండిపడే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.