twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్-శృతి హాసన్ ‘పూజ’ రిలీజ్ డేట్...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘పూజ'. యాక్షన్ చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 22న దీపావళి కానుకగా 500 థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

    ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ...‘అక్టోబర్ 22న ‘పూజ' చిత్రాన్ని తెలుగులో 500 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. గతంలో వచ్చిన నా సినిమాల్లాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. దీపావళి పండగకు మీ ముందుకు వస్తున్న మా ‘పూజ' చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.

    Vishal's Pooja movie release date

    విశాల్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రాధిక, అభినయ, జయప్రకాష్, మనోబాల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ప్రియన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్, కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి.

    English summary
    Vishal, Shruti Haasan starrer Pooja movie releasing on October 22.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X