ట్రైలర్ చూస్తూంటే హిట్ కొట్టేటట్లే ఉన్నాడు (వీడియో)
హైదరాబాద్ : 'తామిరభరణి' తర్వాత దర్శకుడు హరి- నటుడు విశాల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పూజై'. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం విడుదల అవుతోంది. ఈ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు. ఈ టీజర్ ని మీరూ చూడండి.
ఇటీవలే ఆడియో విడుదల ఘనంగా జరిగింది. చిత్ర విశేషాల గురించి యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరి, నటుడు సత్యరాజ్, విశాల్, నటి శ్రుతిహాసన్ తదితరులు హాజరయ్యారు. విశాల్ తన సొంత బ్యానరులో దీన్ని నిర్మిస్తున్నారు. వేందర్ మూవీస్ బ్యానరుపై ఎస్.మదన్ విడుదల చేస్తున్నారు.

విశాల్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో నిజమైన యాక్షన్ హీరోగా నటించా. పోరాట సన్నివేశాల్లో వేగం ఉంటుంది. నేను, శ్రుతిహాసన్ కలిసి నటించిన సన్నివేశాలు ఉద్వేగంగా ఉంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. దర్శకుడు హరి ప్రత్యేకత ఇందులో కనిపిస్తుంది. జీవితంలో గెలుపోటములు సహజం. అసలు వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తుంటే.. అనుకున్నది సాధిస్తాం. నా పదేళ్ల సినీజీవితం ఈ నీతే నేర్పింద''ని చెప్పారు.
శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ''తమిళ ప్రేక్షకులు ఇష్టపడే కథ ఇది. ఇందులో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా. విశాల్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అనుకున్న విధంగానే సినిమా బాగా వచ్చింద''ని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటి ఆండ్రియా ఓ పాటలో కనిపించి సందడి చేయనుండటం విశేషం.


Click it and Unblock the Notifications











