»   »  విశాల్ ‘రాయుడు’ లుక్ అదిరింది (ఫస్ట్ లుక్)

విశాల్ ‘రాయుడు’ లుక్ అదిరింది (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరో కార్తీ కాంబినేషన్‌లో 'కొంబన్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండగా, ధనుష్‌ హీరోగా రూపొందిన 'రఘువరన్‌ బి.టెక్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన వేల్‌రాజ్‌ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం. ఈరోజు 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

 Vishal's Rayudu First Look

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుంది. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రాయుడు' తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''రాయుడు' విశాల్‌ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్‌ అవుతుంది. మే మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 Vishal's Rayudu First Look

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.

English summary
Vishal's Rayudu First Look released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu