twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ బేనర్లో విశాల్ స్ట్రైట్ తెలుగు సినిమా...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా మార్కెట్లో తమిళ హీరో విశాల్ సినిమాల మంచి డిమాండ్ ఉంది. ‘పందెం కోడి' తర్వాత విశాల్ సినిమాలు ఇక్కడ బాగా ఆడటం మొదలు పెట్టాయి. అయితే విశాల్ సినిమాలు ఇప్పటి వరకు తెలుగులో విడుదలైనవన్నీ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకు విశాల్ నేరుగా ఒక్క సినిమా కూడా తెలుగులో చేయలేదు.

    గతంలో తన సినిమాల విడుదల సందర్భంగా పలు సందర్భాల్లో విశాల్ తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తానని ప్రకటిస్తూనే వస్తున్నారు. ఎట్టకేలకు ఇది నిజం కాబోతోంది. త్వరలో విశాల్ నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నారు. ఆ సక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నితిన్‌ ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించనుంది.

    Vishal's straight Telugu film in Nithiin's banner

    ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించబోతున్నారు. రెండేళ్ల క్రితమే శశికాంత్ విశాల్ కు స్టోరీ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ నిర్మాణంలో విశాల్ సొంత బేనర్ ‘విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ' కూడా భాగం కానుందని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    ఆ సంగతి పక్కన పెడితే విశాల్ నటించిన మరో తమిళ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. విశాల్ హీరోగా నటించిన మగమహారాజు ఈ నెల 15న విడుదల కానుంది. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. ‘చంద్రకళ' వంటి హర్రర్ కామెడితో సక్సెస్ కొట్టిన సుందర్ సి దర్శకత్వం చేసిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తుంది. తమిళ నటుడు ప్రభు.. విశాల్ నాన్నగా కనిపిస్తున్నాడు. తమిళంలో ‘ఆంబల' పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో ‘మగ మహారాజు'గా విడుదలవుతోంది.

    English summary
    Vishal's straight Telugu movie is confirmed. He has given his nod for a story narrated by a young director named Sashikanth two years back and now this project will hit the floors in February. Interestingly this film will be produced under actor Nithiin's home banner, Shresth movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X