»   » ఆమెకు నాకంటే మంచి మొగుడే దొరికాడు: హీరో విశాల్, అమ్మ దీవెన వల్లే...

ఆమెకు నాకంటే మంచి మొగుడే దొరికాడు: హీరో విశాల్, అమ్మ దీవెన వల్లే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వాడే అయినా తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న హీరో విశాల్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ స్టార్ డం ని సొంతం చేసుకుని, తన మూవీలతో మాస్ హీరోగా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని పొందాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పై వివక్షా పూరిత వ్యాఖ్యలతో తమిళ హీరోలు ఎంత క్షోభ పెట్టారో గుర్తు చేసుకున్నారు. అసలు తమిళ ప్రజలకు లోకల్ నాన్ లోకల్ భేదం లేదనీ కానీ ఆరోజు రెడ్డి,రెడ్డీ అంటూ తాను నాన్ లోకల్ అన్న విశయాన్ని పని గట్టుకొని ప్రచారం చేసారంటూ ఆవెదన ని వెళ్ళ బోసుకున్నాడు.

తమిళ నడిగర సంఘం అధ్యక్షుడిగా గత మూడుసార్లుగా రాధిక భర్త శరత్ కుమారే ఎన్నిక కావటం వళ్ళ ఆయనలో ఆయనలో నియంత లక్షణాలు ఎక్కువయ్యాయంటూ... ఓ కొత్త ప్యానెల్ ను ఏర్పాటు చేశాడు విశాల్.శరత్ కుమార్ బావమరిది, సీనియర్ నటుడు రాధారవి... తన ప్రచారంలో విశాల్ ను కుక్క అంటే. అదే ప్యానల్ కు చెందిన శింబు నడిగరసంఘం పరువును విశాల్ బజారుకు ఈడుస్తున్నాడని. విశాల్ నక్క వంటి వాడంటూ ఘాటుగా విమర్శలు చేసాడు.

వరలక్ష్మి తో పెళ్ళి విఫలం అవటం వల్లే తాను శరత్ కుమార్ కి పోటీగా తయారయ్యానని అనటం సరికాదనీ, ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకొని ఆమె తండ్రితో యుద్దం చ్ఘేసే ఆలోచన తనకు రాధనీ అంటూ నిజానికి తమిళ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించేందుకే తాను నడిగర సంఘం ఎన్నికలలో తాను శరత్ కుమార్ కి ఎదురు వెళ్ళాననీ చెప్పాడు.కాలేజీ రోజుల్లో తన ప్రేమకథని కూడా చెప్పిన విశాల్ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి తనకంటే మంచి భర్త దొరికాడంటూ చెప్పాడు. 

Vishal say nadigar sangam election experience

మొదట్లో నడిగర సంఘం ఎలక్షన్లలో తాను దిగినప్పుడు ఇవన్నీ అవసరమా అని అమ్మానాన్నా తిట్తారు, కానీ తన తల్లి మార్కెట్ కి వెల్లినప్పుడు ఒక మహిళ "అమ్మా మీ అబ్బాయి మా సమస్యల కోసం యుద్దమే చేస్తున్నాడమ్మా" అంటూ కన్నీళ్ళు పెట్టుకుందట. ఈ విశయం విశాల్ తో చెబుతూ.. ఏమైనా సరే నువ్వు అనుకున్నది చేసే దాకా వెనకడుగుఇ వేయకూ అంటూ దీవించిందని. ఆ ధైర్యమే ఇప్పటికీ తనని ముందడుగు వేయిస్తోందనీ చెప్పాడు.

సమాజానికి ప్రతి ఒక్కరం ఎంతో కొంత సేవచేయాలని తామంతా నమ్ముతామని., అందుకే నడిగర సంఘం భవనంపై పలు కథనాలు విని, భవిష్యత్ లో అలాంటి కథలు వినకూడదని నిర్ణయించుకున్నామని, అయితే ఎవరో ఒకరు ముందుకు నడవాలని సూచించడంతో ఆ బాధ్యతను తాను, కార్తీ తీసుకున్నామని చెప్పిన విశాల్. ఈ భవనం ద్వారా వచ్చే ఆదాయం తో పేద సీనియ నటులకు పించన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు.

కెరీర్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు తన చుట్టూ వుండే మనుషులే ఎంతగా మారిపోయారో తానెప్పటికీ మర్చి పోలేననీ చెప్పిన విశాల్ వరుసగా తన సినిమాలు హిట్ అయినప్పుడు తన పుట్టిన రోజుకి తన గది బొకేలతో నిండిన రోజూ, సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఒకే ఒక్క బొకే వచ్చిన విశ్డయాన్నీ గుర్తు చేసుకున్నాడు...

English summary
Tamil hero ViSaal said about nadigar sangam election experience
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu