Mark Antony Twitter Review: విశాల్ మూవీకి అలాంటి టాక్.. ఆ సీన్లే హైలైట్.. టైం ట్రావెల్ ఎలా ఉందంటే!
కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. తన నటనతో సౌతిండియా మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విశాల్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విశాల్ 'మార్క్ ఆంటోని' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూడండి!
మార్క్ ఆంటోనిగా వచ్చేశారు:తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రమే 'మార్క్ ఆంటోని'. రీతూ వర్మ, సునీల్, అభినయశ్రీ, సెల్వరాఘవన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడు. ఈ సినిమాను వినోద్ కుమార్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ టైం ట్రావెల్ కథతో రూపొందిన విషయం తెలిసిందే.

టైం ట్రావెల్ కావడంతో బజ్:చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న విశాల్ ఇప్పుడు 'మార్క్ ఆంటోని' మూవీని చేశాడు. ఇది మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ముఖ్యంగా ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్టుతో రావడంతో ఆరంభంలోనే దీనిపై బజ్ ఏర్పడింది. దీంతో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఇది ఆకర్షించింది. ఫలితంగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల అయింది.
అతడి కెరీర్‌లోనే బెస్ట్ మూవీ:విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' మూవీని చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించారు. 'అధిక్ ఈ కాన్సెప్టు చేస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. అతడు నా నమ్మకం తప్పని నిరూపించాడు. ఈ మూవీలోని డార్క్ కామెడీ, యాక్షన్ చూసి మొదటిసారి సంతృప్తి చెందాను. విశాల్ కెరీర్‌లో బెస్ట్ మూవీ. ఎస్‌జే సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. మ్యూజిక్ బాగుంది' అని చెప్పుకొచ్చారు.
70 కోట్లు వసూలు చేస్తుందని:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మార్క్ ఆంటోని' మూవీనీ వీక్షించిన ఇంకొక నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా స్పందించారు. 'మార్క్ ఆంటోని మూవీకి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్లు వసూలు చేస్తుంది' అని వివరించారు. దీంతో ఈ చిత్రం తమిళనాడులో సంచలనం అయ్యే చాన్స్ ఉందని పేర్కొన్నాడు.

మొత్తంగా అలాంటి టాక్‌తో:'మార్క్ ఆంటోని' మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో కనిపిస్తోన్న పోస్టులను బట్టి దీనికి పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా టైం ట్రావెల్ స్టోరీ అందరినీ థ్రిల్ చేసేలా తీశారట. ఇందులో విశాల్, ఎస్‌జే సూర్య నటన వేరే లెవెల్ అని చెప్తున్నారు. అదే సమయంలో మ్యూజిక్ కూడా అదిరిందట. మరి ఈ టాక్ నిలబడుతుందో మారుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











