విశాల్ తొలి తెలుగు సినిమా ఖరారు
జికె ఫిల్మ్ కార్పొరేషన్ అధినేత విక్రమ్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ....'చాలా కాలంగా విశాల్ తెలుగులో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మంచి కథ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. దర్శకుడు శశికాంత్ విశాల్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ చెప్పారు.
ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథను విన్న విశాల్ తెలుగు ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకరించడం జరిగింది. భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈచిత్రాన్ని నిర్మించబోతేన్నారు. నవంబర్లో సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తాం' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: వడ్డి రామానుజం, నిర్మాత: విక్రమ్ కృష్ణ, కథ, దర్శకత్వం: శశికాంత్.
విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో పాటు, వాడు-వీడు చిత్రాలు తెలుగులో మంచి మార్కెట్ చేసాయి. కిలాడీ చిత్రం మాత్రం తెలుగులో పెద్ద ప్లాప్‌గా మిగిలింది. ఈ నేపథ్యంలో విశాల్ తెలుగు ఎంట్రీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












