డైరక్టర్ బాలా ఓ సైకో, శాడిస్టులాగ వ్యవహరిస్తాడని..: విశాల్
దర్శకుడు బాలా గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు..ఆయన ఓ సైకో అని... శాడిస్టులాగ వ్యవహరిస్తాడని..అయితే అతనితో పనిచేసిన తరువాత తెలిసింది ఆయన ఎంత గొప్పవ్యక్తో అని. నాకు ఇందులో మంచి రోల్ ఇచ్చి నా ఆకలిని తీర్చిన దేవుడు బాలా అంటూ చెప్పుకొచ్చారు హీరో విశాల్. బాలా దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన 'వాడు వీడు'ఆడియో విడుదల సందర్భంగా విశాల్ ఇలా స్పందించారు.
అలాగే..'నీవు ఇంకా పందెంకోడి విశాల్‌లాగ కనిపిస్తున్నావ్, నీ నటన మార్చుకో' అని చెప్పారు. అందుకు అనుగుణంగా నేను నటనలో మార్పు చేసి చూపించా. ఇందులో నువ్వు మెల్లకన్నుతో నెటించాలన్నారు. అలా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ కూడా మెల్లకన్నుతో నటించినట్లు కనిపించలేదు. నేనే మొదటి వాడిని అనుకుంటున్నా. ఇదే నా చివరి సినిమా అనుకుని నటించా. ఇలాంటి రిస్క్ జీవితంలో మళ్లీ తీసుకోను అన్నారు
.జి.కె.ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై బాలా దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోలుగా నటించిన చిత్రం 'వాడు వీడు'. విక్రమ్ కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరోలు వెంకటేష్, అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆడియో సీడీలను వెంకటేష్ ఆవిష్కరించి మొదటి సీడీని అల్లు అర్జున్‌కి అందజేశారు.


Click it and Unblock the Notifications











