Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
దసరాకు పందెంకోడి2.. త్వరలోనే అభిమన్యుడు సీక్వెల్.. మాస్ హీరో విశాల్
మాస్ హీరో విశాల్, హ్యాట్రిక్ హీరోయిన్ సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ బేనర్స్‌పై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్టాక్తో రెండవ వారంలో కూడా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్ సిఎమ్ఆర్ మాల్లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ విజయానందాన్ని పంచుకున్నారు.
మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ ''ముందుగా 'అభిమన్యుడు' చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకి క తజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఈ విజయంతో నాకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. త్వరలోనే ఇదే టీమ్‌తో 'అభిమన్యుడు-2' మొదలు పెట్టబోతున్నాం. 'పందెంకోడి-2' విజయదశమికి రిలీజ్ అవుతుంది'' అన్నారు.
నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ ''నిర్మాతగా ఇది నాకు చాలా పెద్ద విజయం. ఈ విజయాన్ని అందించిన విశాల్‌కి, ప్రేక్షకులకి క తజ్ఞతలు'' అన్నారు. దర్శకుడు పి.ఎస్.మిత్రన్ మాట్లాడుతూ ''మంచి సినిమాకి ఎక్కడైనా అద్భుతమైన దరణ లభిస్తుందని ఈ విజయం నిరూపించింది. ఇంత మంది సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది'' అన్నారు.