twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్రిక్‌కు విశాల్‌ రెడీ

    By Staff
    |

    విశాల్‌ తెలుగువాడు మాత్రమే కాదు. తెలివైనవాడు కూడా. తెలుగు సినిమా పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు గనుకనే నేరుగా తమిళ చిత్రాలలో నటిస్తూ వాటినే తెలుగులోకి డబ్బింగ్‌ చేసి రెండు పరిశ్రమలలోనూ చక్కగా రాణిస్తున్నాడు.

    తొలి చిత్రం చదరంగం (తమిళంలో చల్లామే), రెండోది పందెంకోడి (తమిళంలో సందైకోళి) తమిళ, తెలుగు భాషల్లో విశాల్‌కు వరుస హిట్లు అందించాయి. తాజాగా అతని మూడో చిత్రం తిమురు తమిళంలో సిద్ధమైంది. ఈ సినిమాలో కూడా విశాల్‌ చక్కని పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడని అంటున్నారు. ఇందులో రీమాసేన్‌కు కూడా చాలా మంచి పాత్ర ఉందని, చిత్రం ఆద్యంతం అల్లరిపిల్లగా అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

    తిమురు చిత్రంలో విశాల్‌ ఒక మెడికల్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తాడు. మధురై నుంచి చెన్నై వచ్చి కాలేజీలో చదువుతున్న అతడంటే అదే కాలేజ్‌లో లెక్చరర్‌ కూతురైన రీమాసేన్‌కు పిచ్చి ప్రేమ. అతడినితో మాట్లాడాలని తహతహలాడుతూ ఎలాగైనా విశాల్‌ని కలవాలని నానా తంటాలు పడుతుంటుంది కానీ విశాల్‌ మాత్రం ఆమెను తప్పించుకు తిరుగుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో మధురై నుంచి ఒక గూండా విశాల్‌, రీమాసేన్‌ల కోసం చెన్నైలో వెతుకుతుంటాడు. అసలు కథ ఏమిటన్నది ఫ్లాష్‌బ్యాక్‌లో ఉంటుంది. మధ్యలో ఒక ప్రత్యేక పాత్రలో ఎస్‌ఎస్‌ మ్యూజిక్‌ వీడియో జాకీ శ్రియారెడ్డి ఒక రఫ్‌ అండ్‌ టఫ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది.

    ఒక సాధారణ కాలేజ్‌ స్టూడెంట్‌గా, ఫైట్‌ సన్నివేశాలలో యాంగ్రీయంగ్‌ మ్యాన్‌గా విశాల్‌ చక్కని నటన ప్రదర్శించాడని తిమురు దర్శకుడు తరుణ్‌ గోపి అంటున్నారు. విశాల్‌ ఈ సినిమా ద్వారా మరో హిట్‌ కొట్టడం ఖాయం అని దర్శకుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చక్కని స్క్రీన్‌ ప్లే, నటీనటుల పెర్ఫార్మెన్స్‌, వీటికి దీటుగా యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ ఈ సినిమాకి హైలెట్స్‌ అంటున్నారు. తెలుగు నిర్మాతలు ఆల్రెడీ ఈ సినిమా హక్కులు కొనేసి ఉండాలి మరి!

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X